Priyanka Mohan: గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారు మనసులో ముద్ర వేసుకున్న ఈ భామ ఈ సినిమా తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించింది. అవకాశాలు అయితే వచ్చాయి గాని విజయాన్ని మాత్రం ప్రియాంక అందుకోలేకపోయింది. ప్రస్తుతం కోలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ప్రియాంక.. ధనుష్ సరసన కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తుంది. ఇదే కాకుండా తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన OG లో నటిస్తుంది. ఇక ఈ రెండు సినిమాలు ప్రియాంక కెరీర్ ను డిసైడ్ చేస్తాయని చెప్పాలి. ఇద్దరు స్టార్ హీరోల సరసన నటిస్తుండడంతో ఇండస్ట్రీలో ప్రియాంక పేరు మారుమ్రోగిపోతుంది.
Saindhav: ఏందయ్యా ఈ క్యాస్టింగ్.. జనాలను చంపేస్తావా.. ?
ఇక తాజాగా ప్రియాంక కెప్టెన్ మిల్లర్ షూటింగ్ ను పూర్తి చేసింది. అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 15న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో ఒక గ్రామీణ యువతిగా ప్రియాంక కనిపించనుంది. తన షూటింగ్ అయిపోవడంతో ప్రియాంక ఒక ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. డైరెక్టర్ అరుణ్ కు గన్ గురిపెడుతూ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ కెప్టెన్ మిల్లర్ షూటింగ్ పూర్తి చేసినట్లు తెలిపింది. ఇక దీంతో పవన్ అభిమానులు కెప్టెన్ మిల్లర్ ను పూర్తి చేశావు కదా.. ఇక OGలో అడుగు పెట్టు పాప అంటూ కామెంట్ చేస్తున్నారు. కోలీవుడ్లో కెప్టెన్ మిల్లర్.. తెలుగులో OG కనుక హిట్ టాక్ తెచ్చుకున్నాయి అంటే ఇండస్ట్రీలో ప్రియాంక రేంజ్ వేరే లెవల్ కు మారిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమాలు ఈ అమ్మడికి ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.