Director Maruthi Unveils Ee Kaalame Song From Nachinavadu: లక్ష్మణ్ చిన్నా, కావ్య రమేష్ జంటగా నటించిన తాజా చిత్రం “నచ్చినవాడు”. ఏనుగంటి ఫిల్మ్ జోన్ బ్యానర్ పై లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తూ స్వయ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరిచిన పాటలు ఆదిత్య మ్యూజిక్ లో రిలీజ్ అయి ట్రేండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడుయువ రచయిత హర్షవర్ధన్ రెడ్డి రచించగా ప్రముఖ గాయకుడు జావేద్ అలీ ఆలపించిన ‘ఈ కాలమే’ పాటను సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి విడుదల చేశారు. ఈ క్రమంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ “మలయాళ సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరిచిన ‘ఈ కాలమే’ పాటను విన్నా, పాట మంచి ఫీల్ గుడ్ గా చాలా బాగుంది.
Raghava Lawrence: నా ట్రస్ట్ కి ఎవరూ విరాళాలు ఇవ్వొద్దు.. రాఘవ లారెన్స్ షాకింగ్ వీడియో
ఈ సినిమా ట్రైలర్ కూడా చూశాను, చాలా బాగుందని అన్నారు. హీరో, దర్శకుడు, నిర్మాత అయిన లక్ష్మణ్ చిన్న గారికి ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది అని భావిస్తున్నానని చెబుతూ టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక హీరో, దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ “నచ్చినవాడు” చిత్రం నుంచి ఈ రోజు ‘ఈ కాలమే’ అనే పాటను దర్శకుడు మారుతి విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ పాట నా సినిమాకి ప్రాణం లాంటిదని అన్నారు. మహిళల గౌరవం, ఆత్మాభిమానం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక చక్కటి ప్రేమకథ, సున్నితమైన హాస్యం ఉంటాయని టీమ్ చెబుతోంది. కథకు తగ్గట్టు నటీనటులు అందర్నీ కొత్తవాళ్లను తీసుకున్నామని, యువత కోరుకునే అంశాలు, వాళ్ళకు కావాల్సిన కథాంశం సినిమాలో ఉన్నాయని వెల్లడించారు.