Leading News Portal in Telugu

Ajith Kumar: ఒక స్టార్ హీరో ఇలాంటి సినిమా చేయడు…


సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత కోలీవుడ్ మాస్ ఆడియన్స్ లో ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో ‘తల అజిత్’. కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయి ఈ జనరేషన్ నటుల్లో కూడా ‘అజిత్’ టాప్ ప్లేస్ లో ఉంటాడు. అటు స్టార్ ఇమేజ్, ఇటు యాక్టింగ్ స్కిల్స్ రెండూ ఉన్న అజిత్ కి వరల్డ్ వైడ్ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. 2023 సంక్రాంతికి తునివు సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన అజిత్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. అజిత్ ని ఫ్లాప్స్ నుంచి బయట పడేసిన మంగాత్తా సినిమా రిలీజ్ అయ్యి 12 ఏళ్లు అయిన సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ చేస్తున్నారు. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ మూవీ కోలీవుడ్ ఫిల్మోగ్రఫిలోనే ఒక కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. అజిత్ ని హిట్స్ నుంచి బయట పడేయడమీ కాకుండా ‘వినాయగన్’ అనే టిపికల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ని ఆడియన్స్ కి పరిచయం చేసింది. హీరోలు నటించే పాత్రలకి గ్రే షేడ్ ఉండడం మాములే కానీ మంగాత్త సినిమాలో అజిత్ కంప్లీట్ నెగటివ్ షేడ్ ఉన్న రోల్ చేసాడు. డబ్బు కోసం ఏమైనా చేసే కరప్ట్ పోలీస్ గా అజిత్ చేసిన పెర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు.

కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న టైమ్ లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఏజ్డ్ గా కనిపించడానికి, కంప్లీట్ నెగటివ్ రోల్ ప్లే చేయడానికి ఏ టయర్ 1 హీరో ఒప్పుకోడు… అలాంటి రిస్క్ ని తీసుకోని కూడా ఆడియన్స్ ని మెప్పించాడు అజిత్. సూపర్బ్ ఇంట్రడక్షన్, పీక్ స్టేజ్ ఎలివేషన్ ఇచ్చిన ఇంటర్వెల్, అసలు ఊహించని క్లైమాక్స్ లు మంగాత్తా సినిమాని స్పెషల్ గా మార్చాయి. అజిత్-అర్జున్ మధ్య వెంకట్ ప్రభు వేసిన సీన్స్ విజిల్ వర్త్ అనే చెప్పాలి. అజిత్-త్రిష మధ్య ఉన్న డమ్మీ లవ్ ట్రాక్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఒక హీరో కేవలం డబ్బు కోసం ఇన్ని చేశాడా అనిపించకమానదు. ఇలాంటి సినిమాని యువన్ శంకర్ రాజా తన మ్యూజిక్ తో మరింత ఎలివేట్ చేసాడు. కోలీవుడ్ బెస్ట్ హీరో బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ లో మంగాత్తాకి యువన్ కొట్టిన మ్యూజిక్ టాప్ 5లో ఉంటుంది. ఈ సినిమా ఇంత స్పెషల్ కాబట్టే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #AjithKumar #12YrsOfKWFameMANKATHA అనే ట్యాగ్స్ ని క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఎప్పటినుంచో ఫ్యాన్స్ మంగాత్తా సినిమాకి సీక్వెల్ అడుగుతూనే ఉన్నారు. మరి 12 ఏళ్లు గడిచిన ఈ సినిమాకి వెంకట్ ప్రభు-అజిత్ కలిసి సీక్వెన్స్ ప్లాన్ చేస్తారేమో చూడాలి.