Leading News Portal in Telugu

Kathanar: బ్రేకింగ్.. మరో ఇంట్రెస్టింగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అనుష్క శెట్టి


Anushka Shetty Joins Kathanar The Wild Sorcerer: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న అనుష్క శెట్టి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ఫాంటసీ హారర్ డ్రామా కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో జయసూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రోజిన్ థామస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క శెట్టి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించారు. అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమత్తత్తు కథనార్ కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

Pooja Hegde : లోదుస్తులు లేకుండా క్లీవేజ్‌ షోతో షాకిచ్చిన బుట్ట బొమ్మ…

కథనార్ రెండు నిమిషాల నిడివి గల ‘గ్లింప్స్’ను బట్టి చూస్తే జయసూర్యను చర్చి అధికారుల ఖైదీగా చూపుతున్నట్టు కనిపిస్తోంది. అతను తమ చర్చిని నాశనం చేసే కొన్ని దుష్ట శక్తులను కలిగి ఉన్నాడని వారు నమ్ముతారు. మరోపక్క గ్రామస్తులు వ్యాధితో బాధపడుతున్నట్లు చూపించారు. టీజర్‌లో స్పూకీ వైబ్ ఉంది ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ టీజర్‌కు ఆకట్టుకునేలా చేసింది. మేకర్స్ చివర్లో R రామానంద్ రాసిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల చేయబడుతుందని, అందులో ఒకటి 2024లో విడుదల కానుందని వెల్లడించారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియన్ ఐదు భాషలతో కలిపి మొత్తం 14 భాషల్లో రిలీజ్ కానుంది. ఇక వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి ఇండియన్ మూవీ ఇదే. అయితే టీజర్ తోనే వెన్నులో వణుకు పుట్టించిన ఈ సినిమాలో అనుష్క శెట్టి భాగం కావడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.