Jawan: ఇండస్ట్రీలో కథలు అన్ని ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఒక లవ్ స్టోరీ తీస్తే.. ఇంకో లవ్ స్టోరీతో పోల్చడం.. ఒక యాక్షన్ కథను.. ఇంకో యాక్షన్ కథతో పోల్చడం చూస్తూనే ఉంటాం. అయితే లైన్ ఒకటే అయినా స్క్రీన్ ప్లే వేరుగా ఉంటుందని మేకర్స్ చెప్పుకొస్తారు. ఇక ఇప్పుడు కూడా జవాన్ మేకర్స్ కూడా డే చెప్పేట్టు ఉన్నారు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అవును.. ఎందుకంటే జవాన్ కూడా కాపీ కథలానే ఉంది అని అంటున్నారు. షారుక్ ఖాన్, నయనతార జంటగా.. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తోంది. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే క్యామియోలో కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూశాక .. అభిమానులందరూ చెప్తున్న మాట.. కార్తీ నటించిన సర్దార్ సినిమాకు కాపీలా ఉంది అని.
కార్తీ డబుల్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో తండ్రి స్పై.. కొడుకు పోలీస్. తండ్రిని పట్టుకొనే ప్రయత్నంలోనే కొడుకు చిక్కులో పడడం.. తండ్రి వచ్చి అతడిని కాపాడడం.. మళ్లీ ఎవరికి కనిపించకుండా వెళ్లిపోవడం జరుగుతుంది. ఇక జవాన్ లో కూడా సేమ్. తండి జవాన్.. కొడుకు పోలీస్. తండ్రికి సంబంధించిన కేసుపైనే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో చిక్కులో పడడం.. తండ్రి ఎంట్రీ ఇచ్చి అతనిని కాపాడడం ట్రైలర్ లో చూపించారు. మొదటి షారుఖ్ భార్యగా దీపికా కనిపించగా .. రెండో షారుఖ్ భార్యగా నయన్ కనిపించింది. ఇక వన్స్ ఏ స్పై.. ఆల్వేస్ ఆ స్పై అన్నట్లు.. ఇందులో ఒక్కసారి జవాన్ అయితే దేశం కోసం ఎన్నిసార్లు అయినా చనిపోవడానికి సిద్దమవుతాడు అనే డైలాగ్ ను చెప్పించారు. దీంతో ఈ రెండు కథల లైన్ ఒకటే.. సర్దార్ సినిమా లైన్ తీసుకొని కాపీ కొట్టావా అట్లీ బ్రో అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి జవాన్ ఎలా ఉంటుంది అనేది చూడాలంటే.. సెప్టెంబర్ 7 వరకు ఆగాల్సిందే.