Anil Geela: బిగ్ బాస్ మరో మూడు రోజుల్లో మొదలు కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ షో ఎట్టకేలకు వచ్చేనెల రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిపోయారని సమాచారం. ఈ షోలో ఈసారి అంతకుమించి ఉండనుందని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి దాదాపు 21 మంది కంటెస్టెంట్లు ఈ షోలో పాల్గొన్నారని తెలుస్తుంది. ఇందులో మై విలేజ్ షో తో పాపులర్ అయిన అనిల్ గీల కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గంగవ్వతో పాటు కామెడీ రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యాడు. ఎప్పటినుంచో అనిల్.. బిగ్ బాస్ లోకి వస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
ఇక ఈ వార్తలపై తాజాగా అనిల్ స్పందించాడు. బిగ్ బాస్ తో చర్చలు అయితే జరిగాయని.. కానీ, చివర్లో తనను తీసేసారని బాంబు పేల్చాడు. అసలు ఏం జరిగింది..? ఎందుకు తీసేసారు..? అనేది ఆయనక్కూడా తెలియదని చెప్పుకొచ్చాడు.” నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. నా కుటుంబ సభ్యులు నా టీమ్ కూడా నువ్వు వెళ్తే బాగుంటుంది అని చెప్పారు. ఇలాంటి అవకాశాలు ఎప్పుడో కనై అని అందరు చెప్పారు కానీ, నేనే ఆలోచించాను. అప్పుడు మా అమ్మ ఇలా సమయాన్ని వృధా చేసుకోకుండా బిగ్ బాస్ కు వెళ్లి డబ్బులు సంపాదించు అని చెప్పడంతో నేను సరే అన్నాను. ఈ విషయం బయటికి వచ్చిన దగ్గర్నుంచి నా ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్ సోషల్ మీడియాలో నాకు మెసేజ్ లు చేస్తూనే ఉన్నారు. ఎలాంటి స్టాటజీలు లేకుండా నిజాయితీగా ఆడండి.. ఈము మీకు సపోర్ట్ గా ఉన్నాం అని కూడా చెప్పారు. ఇక బిగ్ బాస్ నుంచి నాకు కాల్ రావడంతో నేను ఎంతో సంతోషించాను. ఇక అన్నిసెట్ అయ్యాయి అనుకున్నాను. దాదాపు 99.99% వెళ్తాను అనుకొనేలోపు వాళ్ళు కాల్ చేసి నన్ను రిజెక్ట్ చేశారు అని చెప్పారు. అసలు ఎందుకు వాళ్లు ఇలా చేశారు అనేది నాకు ఇప్పటికి తెలియదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.