
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సగం షూటింగ్ పూర్తికావాల్సి ఉండగా ఎన్నో కారణాలవల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఈ మధ్యనే వెకేషన్ నుంచి వచ్చిన మహేష్ కంటిన్యూస్ గా గుంటూరు కారం షూటింగ్లో పాల్గొంటూ షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం SSMB29. దర్శకుధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటివరకు పరాజయం అందుకొని రాజమౌళి మొట్టమొదటిసారి మహేష్ తో సినిమా చేయనున్నాడు. ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో మహేష్ సినిమా తెరకెక్కనుందని ఇప్పటికే రాజమౌళి హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
Rashmika Mandanna: ముక్కుకు ముక్కెరతో ఎంత అందంగా ఉన్నావ్ శ్రీవల్లీ..
ఇక బయట రాజమౌళి, మహేష్ కలవడం కూడా చాలా రేర్ గా చూశారు అభిమానులు. మహేష్ ఒక సినిమా ఒప్పుకున్నాడు అంటే.. ఆయన ఎక్కడవుంటే ఆ డైరెక్టర్ అక్కడే ఉంటాడు. కానీ జక్కన్న మాత్రం .. మహేష్ తో కనిపించడం చాలా రేర్. కాగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి, మహేష్ రేపు కలవనున్నారట. ఈ సినిమా ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ కుమార్తె పెళ్లికి మహేష్ బాబుతో పాటు రాజమౌళి కూడా హాజరుకానున్నారట. అక్కడ వీరిద్దరూ కలిసి కనిపించనున్నారు. దీంతో అభిమానులు ఈ పెళ్లి కోసం, మహేష్ బాబు- రాజమౌళి కలిసి ఉన్న ఫోటోలు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ పెళ్లి తర్వాత అయినా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ నైనా మేకర్స్ ఇస్తారేమో చూడాలి.