నందమూరి స్టార్ హీరో బాలయ్య పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ సోనాల్ చౌహన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. లెజెండ్ తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ సోనాల్ చౌహన్. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ మంచి విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది అయితే ఆ సినిమాలు పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేక పోయాయి… ఆతర్వాత మరోసారి బాలకృష్ణ తో కలిసి నటించింది. ఆ డిక్టేటర్ సినిమా కూడా ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ సోనాల్ అందాలకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
అలాగే బాలయ్యతో ముచ్చటగా మూడో సారి కూడా నటించింది. బాలయ్య నటించిన రూలర్ మూవీలోనూ చేసింది ఈ అమ్మడు. ఇలా బాలకృష్ణతో మూడు సినిమాలు చేయగా వీటిలో లెజెండ్ మాత్రమే హిట్ అయ్యింది.. ఆతర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్3 లో నటించింది. ఈ మంచి విజయాన్ని అందుకుంది. కానీ సోనాల్ కు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు.. చివరిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ లో నటించింది సోనాల్. ఆదిపురుష్ లో రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపించింది సోనాల్. భారీ ఆశలు పెట్టుకున్న అమ్మడుకు నిరాసే మిగిలింది..
ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఇదిలా ఉంటె ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు క్రేజీ ఆఫర్ తలుపు తట్టిందని తెలుస్తోంది.. మహేష్ బాబు నటిస్తున్న సినిమాలో ఈ అమ్మడు నటించే ఛాన్స్ ఉందని ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ సినిమాలో ఓ భారీ ప్లాన్ జరుగుతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నారు మహేష్. ఈ తర్వాత రాజమౌళి మూవీలో జాయిన్ కానున్నారు. ఈ చిత్రం లో కీలక పాత్ర కోసం సోనాల్ తో సంప్రదింపులు జరిపినట్టు టాక్ వినిపిస్తుంది.. జక్కన్న సినిమా కావడంతో వెంటనే ఓకే చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి..