Leading News Portal in Telugu

MAD: ‘మ్యాడ్’గాళ్లు సైలెంటుగా వచ్చేస్తున్నారు.. – NTV Telugu


Sithara Entertainments MAD to release on 28th September: ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’ మూవీ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. రక్షా బంధన్ రోజున సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమా ప్రకటించి టీజర్ రిలీజ్ చేయగా ఇప్పుడు యూట్యూబ్‌లో అది ట్రెండింగ్ లో ఉంది. ఇక వినోదభరితంగా సాగిన టీజర్ కి వస్తున్న అద్భుతమైన స్పందనతో మ్యాడ్ సినిమా విడుదల తేదీని ప్రకటించాలని సినిమా యూనిట్ నిర్ణయించుకుని మ్యాడ్ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Bigg Boss Telugu 7: లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చిన నటి.. ఏకంగా హీరోయిన్ ను దింపుతున్న బిగ్ బాస్ టీమ్

ఈ సినిమాలు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒక్క టీజర్ తోనే యువత దృష్టిని ఆకర్షించి, థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలనే ఆసక్తి కలిగేలా చేసిన మ్యాడ్ సినిమా మీద మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి సినిమాటోగ్రఫర్ లుగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఇక ఈ సినిమాలో రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, అంతోనీ, శ్రీకాంత్ రెడ్డిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.