Leading News Portal in Telugu

Jailer: జైలర్ రికార్డుల ప్రభంజనం.. డైరెక్టర్ కు కాస్ట్లీ కారు గిఫ్ట్


Jailer:సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, తమన్నా హీరోయిన్ లుగా నటించగా మోహన్ లాల్, శివన్న క్యామియోలో కనిపించారు. ఆగస్టు 10న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. దాదాపు 600 కోట్లు వరకు వసూళ్లను అందుకొని చరిత్ర సృష్టించింది. ఇప్పుడు కూడా జైలర్ రికార్డులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక జైలర్ ఇంతటి సక్సెస్ అందుకోవడంతో నిర్మాత కళానిధి మారన్ ఇప్పటికే రజనీకాంత్ కు చెక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Jagapathi Babu: ఆ కలర్ బట్టలు వేసుకుంటే.. వీడు తేడా అనేవారు

తాజాగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు నిర్మాత కళానిధి మారన్ ఒక కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. సరికొత్త పోర్షే కారును గిఫ్ట్ గా అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ కారు విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ గిఫ్ట్ పై నెల్సన్ స్పందించాడు. ట్విట్టర్ వేదికగా ఆయన తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.” థాంక్యూ సో మచ్ కళానిధి మారన్ సార్. నాకు అందమైన కారును బహుమతిగా ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మీతో అనుబంధం కలిగి ఉన్నందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను. అంతకంటే ఎక్కువ సంతోష పడుతున్నాను. మీరు రజనీకాంత్ గారికి చెక్ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది. థాంక్యూ సో మచ్ సార్” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.