Leading News Portal in Telugu

Jagapathi Babu: ఆ కలర్ బట్టలు వేసుకుంటే.. వీడు తేడా అనేవారు


Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరైన జగ్గూభాయ్.. ఇప్పుడు విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ తో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోల అందరి సినిమాల్లో జగపతిబాబు నటిస్తున్నాడు. ఇక సినిమాల్లో ఎంత యాక్టివ్ గా ఉంటాడో.. సోషల్ మీడియాలో కూడా జగ్గూభాయ్ అంతే యాక్టివ్ గా ఉంటాడు. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటాడు. ఆయన ఫోటోషూట్స్, ఇంట్లో చేసే పనులు.. విదేశాల్లో తిరిగిన ప్లేస్ లు అన్నింటిని పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ పోస్టులు కంటే ముఖ్యం ఆయన పెట్టె క్యాప్షన్స్. ఫొటోకు తగ్గ విషయానికి హ్యూమర్ జోడించి క్యాప్షన్లు పెడుతూ ఉంటాడు.అందుకే ఫ్యాన్స్ ఆయన క్యాప్షన్లకు కూడా ఫ్యాన్ అని చెప్తూ ఉంటారు.

Upasana Konidela: కూతురుతో కలిసి మొదటిసారి వరలక్ష్మీ వ్రతం చేసిన ఉపాసన.. ఫోటో వైరల్

తాజాగా జగ్గూభాయ్.. ఒక ఫోటోను షేర్ చేశాడు. పిక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో బేబీ పింక్ కలర్ అవుట్ ఫిట్ లో కనిపించాడు. జుట్టుకు లైట్ గా వైట్ కలర్ వేయడంతో అల్ట్రా స్టైలిష్ గా కనిపించాడు. ఇక దీనికి క్యాప్షన్ గా.. ” జుట్టుకి రంగు వేసుకునే రోజులు అప్పుడు ఈ రంగు బట్టలు వేసుకుంటే, వీడు ఆ టైప్ రా అన్నారు… ఇప్పుడు జుట్టుకి రంగు వేసుకుని, అదే రంగు బట్టలు వేసుకుంటే అదిరింది అంటున్నారు… ఏంటో ఈ అర్ధంకాని లోకం” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోపై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. సూపర్ ఉన్నారు అని కొందరు అంటుండగా.. మరి కొందరు.. మీరు ఏ కలర్ వేసినా బావుంటుంది అని చెప్పుకొస్తున్నారు.