Leading News Portal in Telugu

Mannara Chopra: డైరెక్టర్ ముద్దు.. మన్నారా చోప్రా షాకింగ్ కామెంట్స్.. బేటీ బేటీ అంటూ?


Mannara Chopra on AS Ravi Kumar Chowdary Kiss: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, హీరో, హీరోయిన్లుగా మన్నారా చోప్రా కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘తిరగబడరా సామీ’. ఈ సినిమాకి చాలా కాలం తరువాత ఎస్‌. రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించగా డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ హీరోయిన్ మన్నారా చోప్రాకు ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆ వీడియో నెట్టింట బాగా వైరల్ కావడంతో డైరెక్టర్ ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. ఇక అలా చేయడంపై డైరెక్టర్ స్పందిస్తూ తాను తప్పుడు భావనతో అలా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఆమెపై ఉన్న ఆప్యాయతతో తాను ముద్దు పెట్టుకున్నాను అని చెప్పుకొచ్చారు. తాజాగా హీరోయిన్ మన్నారా చోప్రా కూడా ఈ ఘటనపై క్లారిటీ ఇచ్చింది.

Bhagavanth Kesari: బిడ్డా!! చిచ్చా వచ్చిండు … మనకి పండగ ముందే తెచ్చిండు

ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మన్నారా చోప్రా ఆ ఘటనపై తొలిసారి స్పందించింది. డైరెక్టర్ తప్పుగా అలా చేసి ఉంటారని తాను అనుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. మొదటి నుంచి ఏఎస్ రవికుమార్ తనని బేటీ బేటీ అనే పిలిచే వారని తెలిపింది, తన వర్క్ ని ఎన్నోసార్లు మెచ్చుకున్నారని.. సినిమాలో తానే లీడ్ హీరోయిన్ లా ఉంటుందని మెచ్చుకున్నారని చెప్పికొచ్చింది. అలాగే అలా ముద్దు పెట్టుకుని వెళ్లిపోగానే అసలు అక్కడ ఏం జరుగుతోందో కూడా తనకి అర్థం కాలేదని, తన రియాక్షన్ చూస్తే మీకు అర్ధం అవుతుందని ఆమె చెప్పుకొచ్చింది. తనకు ఇలా జరగడం ఇదే తొలిసారి అని డైరెక్టర్ ప్రవర్తనను తప్పుగా అర్థం చేసుకోలేదని ఆమె ఈ క్రమంలో వెల్లడించింది.