Leading News Portal in Telugu

Salaar: డైనోసార్ రాకపోతే.. టైగర్ వస్తున్నాడట.. ?



Raviteja

Salaar: సలార్.. సలార్.. సలార్.. ప్రస్తుతం ఎక్కడ విన్న సలార్ మాటే వినిపిస్తుంది. ప్రభాస్, శృతిహాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సలార్ సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించడంతో ఇప్పటినుంచే ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. సాయంత్రం లోపు మేకర్స్ అధికారికంగా కూడా ప్రకటించనున్నారని తెలుస్తుంది. సీజీ వర్క్ పూర్తి కాకపోవడంతో సలార్ ను వాయిదా వేశారని చెప్పుకొస్తున్నారు. ఇక సలార్ వాయిదా పడడంతో మిగతా సినిమాలు ఆ డేట్ ను ఫుల్ ఫిల్ చేయడానికి రెడీ అవుతున్నాయి. సెప్టెంబర్ 28న సలార్ వస్తుందని మేకర్స్ ముందుగానే ప్రకటించారు కానీ.. ఇప్పుడు అది డిసెంబర్ కు చేంజ్ అయిందని వార్తలు వినిపిస్తుండడంతో.. ఆ డేట్ ను ఉపయోగించుకోవడానికి టైగర్ సిద్ధమయ్యాడు అని వార్తలు వస్తున్నాయి.

Bhagavanth Kesari: బిడ్డా!! చిచ్చా వచ్చిండు … మనకి పండగ ముందే తెచ్చిండు

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు వచ్చేనెల రిలీజ్ కు సిద్ధమైందన్న విషయం తెలిసిందే. స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు.. ఈ సినిమా అక్టోబర్ 20 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఆ రోజు దీంతోపాటు బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి కూడా పోటీ పడుతుంది. ఇక ప్రస్తుతం సలార్ పోస్ట్ పోన్ కావడంతో ఆ డేట్ ను టైగర్ కబ్జా చేస్తుందని అంటున్నారు. సెప్టెంబర్ 29న టైగర్ రానుందని, త్వరలోనే మేకర్స్ అధికారంగా ప్రకటించనున్నారని సమాచారం అందుతుంది. ఇక మరో పక్క ఇదే డేట్ న స్కంద కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే యూనిట్ వర్గాలు రిలీజ్ డేట్ విషయంలో మార్పులు చేస్తున్నారని అంటున్నారు. మామూలుగా అయితే స్కంద సెప్టెంబర్ 15 న రానుంది. అయితే పది రోజులు వెనక్కి వెళ్లి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు. మరి ఇందులో నిజాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.