Leading News Portal in Telugu

Shiva Nirvana: సమంత-దేవరకొండ లిప్ లాక్ అవసరమా? అన్న రిపోర్టర్.. శివ నిర్వాణ షాకింగ్ ఆన్సర్


Shiva Nirvana About Vijay Deverakonda- Samantha Liplock: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించి. ఇక అక్కడే మీడియా సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఒక రిపోర్టర్ సినిమాలో సమంత విజయ్ దేవరకొండ మధ్య లిప్ లాక్స్ గురించి ప్రస్తావించారు. ఒకే పాటలో రెండు సార్లు సమంత, విజయ్ దేవరకొండ మధ్య లిప్ లాక్స్ పెట్టాల్సిన అవసరం ఉందా అని అడిగితే దానికి శివ నిర్వాణ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. రెండుసార్లు కాదని, మేము ఒకసారి లిప్ లాక్ షూట్ చేశామని శివ నిర్వాణ చెబితే సాంగ్ లో మాత్రం రెండు సార్లు ఉందని రిపోర్టర్ మళ్లీ చెప్పుకొచ్చారు.

Manchu Lakshmi: మనోజ్ కు పెళ్లి చేసినందుకు.. లక్ష్మీని దూరం పెట్టిన విష్ణు.. ?

దానికి పెద్ద పెట్టున నవ్వేసిన శివ నిర్వాణ మనం మాట్లాడేది సమంత గురించి కాదు ఆరాధ్య క్యారెక్టర్ గురించి అక్కడ సమంత గారు కాదు ఆరాధ్య క్యారెక్టర్ ఉందని చెప్పకొచ్చారు. ఆ క్యారెక్టర్ తన ప్రియుడితో ఒక ఏడాది ట్రావెల్ చేస్తుంది, పెళ్లయిన తర్వాత పిల్లల కోసం తపన పడుతున్న సమయంలో ఆ ఎమోషన్ లో చిన్న ముచ్చట కూడా లేకపోతే అసలు అర్థం పర్థం ఉంటుందా? అని ఎదురు ప్రశ్నించారు. చూసే జనాలు నమ్మాలి కదా వీరిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అనే విషయం ఇలాంటి విషయాల వల్లే కదా జనానికి రీచ్ అయ్యేది, వాళ్ళు నటించడం లేదు జీవిస్తున్నారని ఫీలింగ్ రావాలి కదా అది లైట్ హార్టెడ్ గా పద్ధతిగా ఉన్నంతవరకు ప్రాబ్లం లేదు అని చెప్పుకొచ్చారు.