Leading News Portal in Telugu

Pawan Kalyan: పవర్ స్టార్ బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది..’హరి హర’ వీరమల్లు కొత్త పోస్టర్ ఇదే..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా బర్త్ డే సర్ ప్రైజ్ ను ఇస్తున్నారు మేకర్స్.. గత రాత్రి అర్దరాత్రి పవన్ న్యూలుక్ రివీల్ చేసి సర్ ప్రైజ్ చేసింది చిత్రయూనిట్ హరి హర వీరమల్లు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ పై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి పోస్టర్ జనాలను మెప్పించింది..

తాజాగా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రయూనిట్ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ఆకట్టుకుంటుంది. పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరో కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.. ఆ పోస్టర్ తో పాటుగా ఈ సంతోషకరమైన రోజున మన హరి హర వీరమల్లు అసాధారణ ధైర్యసాహసాలు, దయ, అపరితమితమైన కరుణను జరుపుకుంటున్నాము’ అంటూ పోస్టర్ జత చేస్తూ రాసుకొచ్చారు. ఇక కొత్తగా విడుదలైన పోస్టర్ లో పవన్ ఒక యోధుడిగా కనిపిస్తున్నారు. సీరియస్ లుక్ లో పవన్ నడిస్తోన్న పిక్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది..

ఈ పోస్టర్ సినిమాలోని కీలకమైన ఫైట్ సీన్ అని తెలుస్తుంది.. ఆ సీన్ లో పవన్ చాలా సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు.. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీలకు సంబంధించిన చారిత్రక కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఇక ఈ చిత్రంలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుంది..బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. దాదాపు రూ.150 కోట్లతో నిర్మిస్తోన్న ఈ మూవీలో నర్గిస్ ఫక్రి, పూజిత పొన్నాడ, విక్రమజీత్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.. పవన్ సినీ కేరీర్ లోనే ఈ సినిమా హై బడ్జెట్ సినిమా అనే చెప్పాలి.. దాంతో సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్..