పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సెప్టెంబర్ లో జవాన్, అక్టోబర్ లో లియో, టైగర్ నాగేశ్వర రావు సినిమాలు వస్తున్నాయి… ఇక నవంబర్ నెలలో బాక్సాఫీస్ షేప్ షకల్ మార్చడానికి టైగర్ వస్తున్నాడు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. జోయా, టైగర్ లు యాక్షన్ మోడ్ లో ఉన్నట్లు డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది.
ఈరోజు ఇండియాలో మోస్ట్ హైప్డ్ ఫ్రాంచైజ్ గా ‘యష్ రాజ్ స్పై యూనివర్స్’ నిలిచిందంటే దానికి ఏకైక కారణం ‘ఏక్ థా టైగర్’ సినిమా. సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ‘ఎక్ థా టైగర్’ సినిమాతో మొదలైన స్పై యాక్షన్ సినిమాల పరంపర బాలీవుడ్ లో బాగానే వర్కౌట్ అయ్యింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని పెట్టింది పేరైన ‘ఎక్ థా టైగర్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా ‘టైగర్’ అనే ఒక కొత్త ‘స్పై’ని ఇండియన్ ఆడియన్స్ కి పరిచయం చేసింది. ఈ సినిమాకి సీక్వెల్ గా ‘టైగర్ జిందా హై’ సినిమా రిలీజ్ అయ్యి మొదటి పార్ట్ కన్నా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. టైగర్, జోయాల ప్రేమ… టైగర్ ఇండియా కోసం చేసే యాక్షన్… ఈ రెండూ ఆడియన్స్ ని టైగర్ సీరీస్ కి బాగా దగ్గర చేసాయి. ఇక్కడి నుంచే యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఆలోచన మొదలయ్యింది.
టైగర్ ఫ్రాంచైజ్ నుంచి మూడో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ 2023 నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్, టైగర్ 3 టాగ్స్ హల్చల్ చేస్తున్నారు. టైగర్ 3 కోసం సల్మాన్ ఫాన్స్ మాత్రమే కాదు షారుఖ్ ఖాన్ ఫాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పఠాన్ సినిమాలో సల్మాన్ క్యామియో ప్లే చేసినట్లే, టైగర్ 3లో షారుఖ్ ఖాన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నాడు. ఈ మొత్తం సీక్వెన్స్ టైగర్ vs పఠాన్ సినిమాకి లీడ్ ఇచ్చేలా ఉంటుంది. ఇద్దరు సూపర్ స్టార్ లు ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుందో పఠాన్ సినిమా శాంపిల్ చూపించింది, ఇప్పుడు టైగర్ 3 దానికి పీక్ స్టేజ్ ఎలా ఉంటుందో నవంబర్ 10న చూపించబోతుంది. షారుఖ్, సల్మాన్ ఫాన్స్ ఒకేసారి థియేటర్స్ కి వస్తే బాక్సాఫీస్ దగ్గర సునామీ రావడం ఖాయం.
Thrice the action. Thrice the excitement. Thrice the thrill. #Tiger3 arriving on Diwali 2023. Celebrate #Tiger3 with #YRF50 only at a big screen near you. Releasing in Hindi, Tamil and Telugu. pic.twitter.com/YmZo6s3Xow
— Yash Raj Films (@yrf) September 2, 2023