కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ కి పాన్ ఇండియా మొత్తం ఫాన్స్ ఉన్నారు. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ లివింగ్ హ్యూమన్ బీయింగ్ గా అందరి ప్రేమని సొంతం చేసుకున్న కిచ్చా సుదీప్, బర్త్ డే ఈరోజు కావడంతో సోషల్ మీడియా కిచ్చా ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. సుదీప్ పేరుతో పాటు #Kichha46 ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. సుదీప్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తూ… సుదీప్ బర్త్ డే స్పెషల్ గా ‘కిచ్చా 46’ నుంచి స్పెషల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. సుదీప్ ప్రస్తుతం ఒక యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ‘కిచ్చా 46’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. విజయ్ కార్తికేయ అనే కొత్త దర్శకుడు ‘కిచ్చా 46’ సినిమాని పాన్ ఇండియా రేంజులో రూపొందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ తో అంచనాలు పీక్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ టైటిల్ టీజర్ ని మేకర్స్ లాంచ్ చేసారు. ‘మ్యాక్స్’ అనే టైటిల్ అనౌన్స్ చేస్తూ దాదాపు నిమిషమున్నర వీడియోని రిలీజ్ చేసిన మేకర్స్, ఇంస్టాన్ట్ బజ్ జనరేట్ చేసారు.
కిచ్చా సుదీప్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్ లా కట్ చేసిన ఈ వీడియోలో… తుఫాన్ నుంచి తప్పించుకోవచ్చు, సునామీ నుంచి కూడా తప్పించుకోవచ్చు కానీ వాడి నుంచి తప్పించుకోలేరు అనే డైలాగ్ పోలీసులతో చెప్పించి సుదీప్ కి ఎలివేషన్స్ ఇచ్చారు. గన్స్ తో నిండి ఉన్న రూమ్ లో, లాఠీ తీసుకోని వచ్చి డోర్ దగ్గర నిలబడడంతో టైటిల్ రివీల్ అయ్యి టీజర్ ఎండ్ అయ్యింది. సిల్లవుట్ లో సుదీప్ లుక్ అదిరిపోయింది. మ్యాక్స్ సినిమా విషయంలో మొదటి నుంచి కిచ్చా సుదీప్ మాస్ వైబ్స్ ఇస్తున్నాడు. అజనీష్ లోకనాథ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, టైటిల్ టీజర్ ని ఎలివేట్ చేసింది. పాన్ ఇండియా మార్కెట్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా ఉన్న ఈ టీజర్, మ్యాక్స్ సినిమాపై హైప్ ని అమాంతం పెంచింది. మరి ఈ యాక్షన్ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎవరెవరు నటిస్తున్నారు లాంటి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
We are happy to make this day more special for our Baadshah @KicchaSudeep, and here is the birthday treat for all of you! 🎉
The Demon 😈 has a name now #Max 💥
Title Teaser out now ▶️ https://t.co/YnjetD8xsT#Kichcha46 @Kichchacreatiin @saregamasouth @TSrirammt @shivakumarart… pic.twitter.com/pjA5LJ5MFa
— Kalaippuli S Thanu (@theVcreations) September 1, 2023