Leading News Portal in Telugu

Vyooham : నరకాసురుల నవ్వులు.. రాబందుల హేళనలు అంటూ ఆసక్తి రేకెత్తిస్తున్న టైటిల్ సాంగ్..


డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితుల పై తెరకెక్కిస్తున్న మూవీ వ్యూహం. ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్స్ తోనే ఆర్జివి సంచలనాలు క్రియేట్ చేశారు.తాజాగా నేడు దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి కావడంతో ఈ మూవీ నుంచి వ్యూహం టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ పూర్తిగా దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సంఘటనల ఆధారంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ లోని లిరిక్స్ ఆసక్తి రేకేత్తిస్తున్నాయి.పులుల రూపం లో గుంట నక్కలు..అంటూ మొదలైనా అయినా ఈ సాంగ్.. నరకాసుల నవ్వులు..రాబందుల హేళనలు..జగనుడి మౌనం..రాక్షసుల నాట్యం అంటూ సాగుతుంది.

వ్యూహం సినిమా నుండి విడుదల అయిన మొదటి రెండు టీజర్ల లో చూపిన క్యారెక్టర్లన్నింటినీ మరోసారి ఈ సాంగ్‌లో చూపించారు. గాయత్రీ మంత్రం తో సాంగ్‌ ప్రారంభించడం లో ఆర్జీవీ మార్క్ స్పష్టంగా కనిపించింది. వైఎస్సార్ చనిపోయినప్పుడు సోనియా, చంద్రబాబులు జగన్‌ను పరామర్శించడాన్ని ఈ సాంగ్ లో చూపించారు.అలాగే జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేయడం.. జేడీ లక్ష్మీనారాయణ విచారించడం వంటి అంశాలు కూడా ఈ పాటలో కనిపిస్తోంది. జగన్ పాదయాత్ర వంటి అంశాలు కూడా చూపించడం జరిగింది. మొత్తంగా ట్రైలర్‌లో చూపించిన విజువల్స్ కాస్త అటూఇటూ మార్చి మళ్లీ ఈ సాంగ్ లో చూపించారు.అలాగే ట్రైలర్ లో చూపించిన విధంగా పాట చివర్లో మళ్లీ చంద్రబాబు డైలాగ్‌ ను కూడా పెట్టారు ఆర్జీవి. ఏంటండి ఆ జనం.. మా నాన్న వెంటకానీ, వాళ్ల నాన్న వెంటకానీ అంత జనం రావడం ఎప్పుడూ కూడా చూడలేదంటూ చంద్రబాబు సతీమణి ఆయనతో అనడం.. “జనానికి బాగా పిచ్చి ముదిరింది”.. అంటూ చంద్రబాబు చెప్పే డైలాగ్‌తో ఈ సాంగ్ ముగుస్తుంది.ప్రస్తుతం ఈ సాంగ్ బాగా వైరల్ గా మారింది.