
మరో మూడు వారాల్లో పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రావాల్సిన మోస్ట్ అవైటెడ్ సినిమా ‘సలార్’ వాయిదా పడింది అనే అఫీషియల్ న్యూస్ కోసం సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. ప్రభాస్ మార్కెట్, ప్రశాంత్ నీల్ పైన ఉన్న నమ్మకం రెండూ కలిపి సలార్ సినిమా రేంజ్ పెంచాయి. అలాంటి సినిమా సెప్టెంబర్ 28న వస్తుంది అనుకుంటే వాయిదా పడింది అనే వార్త వినిపిస్తుంది. ఒకవేళ సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కాకపోతే ఏ డేట్ కి వస్తుంది అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మొదలయ్యింది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం సలార్ సినిమా నవంబర్ 9/10న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. దీపావళి ఫెస్టివల్ టార్గెట్ చేస్తూ సలార్ సినిమా రిలీజ్ అవనుందని ఇంసైడ్ టాక్. దసరాకి ఆల్రెడీ లాక్ అయిన సినిమాలు ఉన్నాయి కానీ దీపావళికి తెలుగు నుంచి పెద్ద సినిమాలు లేవు. ఈ కారణంగానే దీపావళి సీజన్ ని సలార్ టార్గెట్ చేయబోతున్నాడట.
దీపావళికి వచ్చి ఇండియన్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడించాలి అని చూస్తున్న ప్రభాస్ కి ఒక మైటీ అపోనెంట్ ఎదురయ్యాడు. బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న ‘టైగర్ 3’ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. నవంబర్ 10న టైగర్ 3 ఆడియన్స్ ముందుకి రానుంది. సల్మాన్ ఖాన్ టైగర్ సీరీస్ తో ఆడియన్స్ ముందుకి వస్తే థియేటర్స్ దగ్గర కలెక్షన్స్ ఏ రేంజులో ఉంటాయో నార్త్ వాళ్లకి చాలా బాగా తెలుసు. పైగా ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్ హిట్ లేదు, ఫ్యాన్స్ అంతా యావరేజ్ సినిమా ఇవ్వు చాలు బ్లాక్ బస్టర్ చేస్తాం అనే కసితో ఉన్నారు. ఇలాంటి సమయంలో టైగర్ 3 సినిమా వస్తుంది అంటే లెక్క 500 కోట్ల నుంచి స్టార్ట్ అవ్వడం గ్యారెంటీ. ఇప్పుడు టైగర్ కి డైనోసర్ ఎదురయ్యింది. ఈ ఇద్దరూ కొట్టుకుంటే నార్త్ లో సల్మాన్ కి, సౌత్ లో ప్రభాస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ క్లాష్ లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది పక్కన పెడితే ఇండియన్ బాక్సాఫీస్ కి మాత్రం సినిమా కనిపించడం గ్యారెంటీ. రెండు సినిమాలు కలిపి ఈజీగా రెండు వేల కోట్లు కలెక్ట్ చేయగలవు. సో నవంబర్ నెలలో సలార్ రిలీజ్ అవ్వడం గ్యారెంటీ అయితే ఇండియాస్ బిగ్గెస్ట్ క్లాష్ ఆన్ అయినట్లే.