బిగ్ బాస్ 7 గ్రాండ్ ఓపెనింగ్ కి రంగం సిద్ధమయ్యింది. లేటెస్ట్ సీజన్ ని ఎవరు హోస్ట్ చేస్తారు అనే డైలమాకి ఎండ్ కార్డ్ వేస్తూ కింగ్ నాగార్జున హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చేసాడు. మరి కొన్ని గంటల్లో టెలికాస్ట్ కానున్న సీజన్ 7 ఓపెనింగ్ ఎపిసోడ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ గా సాగనుంది. ఈ ఇనాగ్రల్ ఎపిసోడ్ ప్రోమో బయటకి వచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకూ చూసిన అన్ని సీజన్స్ కన్నా కొత్తగా డిజైన్ చేసిన ఈ లేటెస్ట్ సీజన్ ఓపెనింగ్ ఎపిసోడ్ ని మరింత జోష్ ఫుల్ గా చేయడానికి నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ కూడా యాడ్ అయ్యారు. నవీన్ పోలిశెట్టి నటిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది, ఈ మూవీ ప్రమోషన్స్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చాడు. నవీన్ నాగ్ కి మధ్య ఫుల్ ఆన్ ఫన్ మాటలు నడిచాయి. ఆ తర్వాత ఖుషి మూవీతో మంచి హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ, టైటిల్ సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మ్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయనున్నాడు.
నాగార్జున, విజయ్ దేవరకొండతో మాట్లాడుతూ సమంత గురించి అడగడం ప్రోమోలో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మరి తన మాజీ కోడలు గురించి నాగార్జునకి విజయ్ దేవరకొండ ఎలాంటి సమాధానం చెప్పాడో ఎపిసోడ్ లో చూడాలి. ఇక నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండతో పాటు స్కంద మూవీ ప్రమోషన్స్ కోసం రామ్ పోతినేని, శ్రీలీల, బోయపాటి శ్రీను కూడా బిగ్ బాస్ స్టేజ్ ఎక్కనున్నారు. హీరోయిన్ శ్రీయ, సమజవరాగమనా ఫేమ్ రెబా జాన్, వైష్ణవి చైతన్య, రాహుల్ సిప్లిగంజ్, గీత మాధురిల నుంచి స్పెషల్ పెర్ఫార్మెన్స్ లు కూడా ఉన్నాయి. ఈ పవర్ ప్యాక్డ్ ఎంట్రీస్ తో బిగ్ బాస్ సీజన్ 7 ఓపెనింగ్ ఎపిసోడ్ ఆడిపోవడం గ్యారెంటీ. మరి ఉల్టా పల్టా, నెవర్ బిఫోర్ సీజన్ అంటూ ప్రమోట్ చేస్తున్న ఈ సీజన్ లో అంత కోత్తగా ఏం డిజైన్ చేసారు అనేది చూడాలి.