Leading News Portal in Telugu

Kajal Agarwal : స్టన్నింగ్ లుక్ లో అదరగొడుతున్న చందమామ..


కాజల్ అగర్వాల్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2007లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం మూవీతో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పరిచయం అయింది.తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం అంతగా ఆకట్టుకోలేదు.అయితే దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ మూవీతో ఈ భామ మొదటి హిట్ అందుకుంది. ఆ తరువాత మగధీర మూవీతో ఈ భామ స్టార్ హీరోయిన్ అయింది.మగధీర సినిమా తరువాత కాజల్ కు వరుస ఆఫర్స్ వచ్చాయి.. తెలుగు, తమిళ భాషల్లో ఈ భామ స్టార్ హీరోయిన్ గా రానించింది.. . బాలీవుడ్ లో కూడా ఈ భామ పలు చిత్రాలలో నటించింది.చేశారు.కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉండగానే కాజల్ వివాహం చేసుకున్నారు. 2020 అక్టోబర్ నెలలో కాజల్ తన మిత్రుడు అయిన గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి కూడా జన్మించాడు.. ప్రస్తుతం కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.. పెళ్ళికి ముందు ఒప్పుకున్న ఇండియన్ 2 సినిమా లో ఈ భామ నటిస్తుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటిస్తుండగా దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అలాగే కాజల్ తెలుగులో బాలయ్య సరసన భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుంది.. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ దసరా కానుకగా విడుదల కానుంది. కాజల్ తన కెరీర్లో ఫస్ట్ టైం బాలయ్యతో కలిసి నటిస్తుంది.దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తుంది. వీటితో పాటు ఈ భామ మరో రెండు సినిమాలను చేస్తుంది.పెళ్లి అయిన కానీ కాజల్ తన వన్నె తరగని అందంతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పిస్తుంది.ఈ భామ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది.నిత్యం తన ఫ్యామిలీ ఫొటోస్ తో పాటు గ్లామర్ పిక్స్ కూడా షేర్ చేస్తుంది. తాజాగా ఈ భామ స్కై బ్లూ కలర్ షర్ట్ లో స్టన్నింగ్ లుక్ ఇస్తూ అదిరిపోయే పోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.