Mark Antony Official Telugu Trailer: తమిళ హీరో విశాల్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మార్క్ ఆంటోని’ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్న క్రమంలో ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ నటుడు కార్తీ తమిళంలో ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా తెలుగులో మాత్రం రానా రిలీజ్ చేశారు. . గతంలో ‘త్రిష లేదా నయనతార’, ‘బఘీర’ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆదిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ మూవీగా సినిమా తెరకెక్కింది. ట్రైలర్ లో కథను పెద్దగా రివీల్ చేయకుండా జాగ్రత్త పడింది సినిమా యూనిట్. విశాల్ ను అనేక వేరియేషన్స్లో చూపించడం బట్టి చూస్తే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు అనిపిస్తోంది. తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్, తెలుగు నటుడు సునీల్ పాత్రలను కూడా ట్రైలర్‌లో చూపించడం ఇంట్రెస్టింగ్ గా ఉంది.
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 లైవ్ అప్డేట్స్
ఒక ఫోన్ ద్వారా టైమ్ ట్రావెల్ చేయడం అనే పాయింట్‌పై సినిమా తెరకెక్కిందని ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు. ఇక సినిమాలో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో విశాల్ నుంచి ప్రేక్షకులు కోరుకునే యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని చేప్పేశారు. ఇక హీరో విశాల్ డ్యూయల్ రోల్ చేయనున్నాడని, ఎస్‌జే సూర్య పాత్ర కూడా భిన్నమైన వేషధారణతో ఉండనుందని క్లారిటీ వచ్చేసింది. ఇక సెప్టెంబర్ 15వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో తమిళం తో పాటు హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో తెలుగు హీరోయిన్ రీతు వర్మ కథానాయికగా నటిస్తోండగా ఎస్ జె సూర్య, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ‘మార్క్ ఆంటోని’ సినిమాని మినీ స్టూడియోస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ పై ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు.