Leading News Portal in Telugu

Rashmika Mandanna : శారీలో ఎంత ముద్దొస్తున్నావ్.. ఆ క్యూట్ నెస్ కే పడిపోతారంతే..


నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. బయట కనిపించడం తగ్గించేసింది. ఇంపార్టెంట్ ఈవెంట్లలోనే సందడి చేసే ఈ భామ ఇప్పుడు అసిస్టెంట్‌ పెళ్లిలో తళుక్కున మెరిసింది.. ఆరెంజ్ కలర్ శారీలో చాలా క్యూట్ గా కనిపించింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఇందులో కలర్‌ ఫుల్‌ అందంతో కట్టిపడేస్తుందీ నేషనల్‌ క్రష్‌. ఆరెంజ్‌ శారీలో రష్మిక సందడంతా తన వద్దే ఉందనేట్టుగా చేసింది. దీంతో ఆమె లుక్స్ నెట్టింట ఇప్పుడు వైరల్‌గా మారాయి.. తన పర్సనల్‌ అసిస్టెంట్‌ సాయి పెళ్లిలో పాల్గొంది. నేడు హైదరాబాద్‌లో సాయి వివాహం జరుగుతుంది. అసిస్టెంట్‌ కోసం స్వయంగా వచ్చింది రష్మిక. ఆరెంజ్‌ శారీ కట్టి పెళ్లి పండపానికి రావడంతో అందరి చూపు ఈ బ్యూటీపైనే పడ్డాయి.. ఆమె వెళ్లేంతవరకు అందరి చూపు ఆమెవైపే ఉందంటే నమ్మాలి..

ఈ పెళ్లికి రష్మిక చాలా సింపుల్ గా ఆరెంజ్ కలర్ శారీలో వచ్చింది.. శారీతోపాటు స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ ధరించింది. దీంతో ఆమె అందం ఓవర్‌లోడ్‌ అనేలా ఉంది. అంతేకాదు చీరలో ఎంతో క్యూట్‌గా ఉంది రష్మిక.. చూసిన వారంతా కూడా ఏమి అందం అని తెగ పొగిడేస్తున్నారు..రష్మిక మందన్నా వరుసగా పాన్‌ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో అల్లు అర్జున్‌తో `పుష్ప2` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇకపోతే ఈ సినిమాతో పాటుగా మరికొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది..