Leading News Portal in Telugu

Pushpa 2 : ఐకాన్ స్టార్ మూవీకి 1000 కోట్ల ఆఫర్..?


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అంతే కాదు ఉత్తమ నటుడు గా నేషనల్ అవార్డ్ ను కూడా సొంతం చేసుకొని దేశవ్యాప్తం గా ఎంతో పాపులర్ అయ్యారు.అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప 2 సినిమా కు ఏకంగా 1000 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చినట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.పుష్ప 2 థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ హక్కుల కోసం ఈ భారీ మొత్తాన్ని ఆఫర్ వచ్చినట్లు సమాచారం.సౌత్ లో గతం లో ఈ రేంజ్ ఆఫర్ ఏ సినిమా కు రాలేదనే చెప్పవచ్చు..అయితే ఈ ఆఫర్ గురించి మైత్రీ నిర్మాతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

మైత్రీ బ్యానర్  ఈ మధ్య వరుస విజయాలు అందుకుంటుంది.. ఆ బ్యానర్ నుంచి తాజాగా విడుదలైన ఖుషి మూవీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.. మైత్రీ నిర్మాతలు పుష్ప 2 సినిమాను దాదాపు 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వారు పెట్టిన బడ్జెట్ కు రెట్టింపు స్థాయిలో ఈ సినిమా కు బిజినెస్ జరుగుతోంది. పుష్ప 2 బిజినెస్ భారీ స్థాయి లో జరిగే అవకాశం వుంది.ఇప్పటికే పుష్ప 2 సినిమాపై భారీగా అంచనాలు పెరిగి పోయాయి. పుష్ప 1 కంటే ఇంకా రస్టిక్ గా పుష్ప 2 ఉంటుందని సమాచారం. పుష్ప 2 సినిమా స్క్రిప్ట్ ను సుకుమార్ ప్రత్యేక దృష్టి పెట్టి మరి సిద్ధం చేసారు.ఈ సినిమా లో మరిన్ని కొత్త పాత్రలు కూడా కనిపించనున్నాయని సమాచారం.ఈ సారి పుష్ప 2 సినిమా కు గాను దర్శకుడు సుకుమార్ కు కచ్చితంగా నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.పుష్ప 2 సినిమాలో కూడా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేసినట్లు సమాచారం.పుష్ప 2 లో కూడా దేవిశ్రీ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.