Vijay Deverakonda Responds about Fake BMS Ratings in Kushi Sucess meet: విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లుగా సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమాకి బుక్ మై షోలో ఫేక్ రేటింగ్స్ పెట్టినట్లుగా వార్తలు వచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. దీని వెనుక ఒక ప్రముఖ హీరో పిఆర్ ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇదే విషయం మీద విజయ్ దేవరకొండ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Ashu Reddy: పైట జార్చేసి పరువాల విందిచ్చేసిన జూనియర్ సమంత
విశాఖపట్నం వేదికగా ఖుషి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించింది మైత్రి మూవీ మేకర్ సంస్థ. ఈ కార్యక్రమానికి హాజరైన విజయ్ దేవరకొండ స్టేజి మీదకి వెళుతూ వెళుతూనే నా మీద మా సినిమా మీద జరుగుతున్న ఈ అటాక్స్, ఈ ఫేక్ బుక్ మై షో రేటింగ్స్, ఫేక్ యూట్యూబ్ వీడియోలు, అకౌంట్లు, ఊరు పేరు లేకుండా తీసుకొని రేటింగ్ లు పెట్టించారని, యూట్యూబ్ వీడియోలు చేయించి కొందరు డబ్బులు పెట్టి చేయించడం అదంతా దాటుకొని ఈరోజు ఈ కలెక్షన్లు ఈ ప్రేమ చూస్తున్నాము అంటే అదంతా మీ వల్లేనని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ఈవెంట్ కి హాజరైన వారందరూ ఒక్కసారిగా కరతాళ ధ్వనులు చేయడంతో మీ అరుపులు కేకలు వింటుంటే దాని గురించి ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు, దాని గురించి మళ్లీ మాట్లాడతా ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుతా అని అంటూ ఆయన టాపిక్ డైవర్ట్ చేశాడు.
అయితే నిజంగా విజయ్ దేవరకొండ సినిమాకి ఇలా ఫేక్ రేటింగ్స్ పెట్టించాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే చర్చ జరుగుతోంది. ఆటిట్యూడ్ ఉన్న హీరోలా కనిపిస్తున్నా సరే సీనియర్ హీరోలు అందరితో విజయ్ దేవరకొండ బానే ఉంటాడు. మరి ఎవరు విజయ్ సినిమాకి ఇలా ఫేక్ రేటింగ్స్ ఎవరు పెట్టారు? అని చర్చ జరుగుతోంది. గతంలో మరో యంగ్ హీరోతో విజయ్ దేవరకొండ కి వివాదాలు ఉన్నట్టు సోషల్ మీడియాలో మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బహుశా ఆ హీరో ఈ వ్యవహారం వెనుక ఉన్నాడా అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ విషయం మీద విజయ్ దేవరకొండ నేరుగా కామెంట్ చేస్తే తప్ప అది ఎవరు అనే విషయం క్లారిటీ వచ్చే అవకాశం లేదు.