Leading News Portal in Telugu

Ustad Bhagat Singh: కత్తులతో ఉస్తాద్ డైరెక్టర్.. మనల్ని ఎవడ్రా ఆపేది?


All set for the Massive Action Schedule Ustaad Bhagat Singh from tomorrow : పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో హరీష్, శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ కావడంతో పాటు ప్రస్తుతం పవన్ చేస్తున్న అన్ని సినిమాల్లో కాస్త యాక్షన్ కి స్కోప్ ఉన్న సినిమా కావడంతో ఈ సినిమా రీమేక్ అని తెలిసినా, పవన్ అభిమానులు కచ్చితంగా హిట్టు పడుతుందని నమ్మకం పెట్టుకున్నారు.

Ashu Reddy: పైట జార్చేసి పరువాల విందిచ్చేసిన జూనియర్ సమంత

గతంలో హరీష్ శంకర్ చేసిన గబ్బర్ సింగ్ కూడా రీమేక్ కావడం దాన్ని బ్లాక్ బస్టర్ చేయడంతో ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని ఇప్పటి నుంచే చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ అప్డేట్ ఇచ్చేసాడు హరీష్ శంకర్. మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ హ్యాండిల్ లో రేపటి నుంచి ఒక మాసివ్ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది అని చెబుతూ హరీష్ శంకర్ కత్తులు, గొడ్డళ్లు ఒక భారీ గంటతో ఉన్న ఫోటోని షేర్ చేసింది. దానికి మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ ని పోస్ట్ చేసిన హరీష్ శంకర్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోబోతోంది అని హింట్ ఇచ్చాడు.