Leo:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేహ్స్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రం భారీ క్యాస్టింగ్ నే పెట్టాడు లోకేష్. సంజయ్ దత్ మెయిన్ విలన్ గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, అర్జున్ సర్జా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ భారీ సినిమా ఆఫర్ కు నో చెప్పినందుకు హీరో విశాల్ బాధపడుతున్నాడు. విశాల్, ఎస్ జె సూర్య మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమా మార్క్ ఆంటోని. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే పలు ఇంటర్వూస్ లో పాల్గొంటున్న విశాల్ ఈ విషయాన్నీ రివీల్ చేశాడు.
Sai Pallavi: ఆ సీక్వెల్ కనుక సాయి పల్లవి చేసి ఉంటే.. నా సామీరంగా
లియో సినిమాలో మొదట అర్జున్ సర్జా పాత్రకు నన్ను అడిగాడు లోకేష్. నువ్వు చేస్తే బావుంటుంది అని చెప్పాడు. నాకు కూడా ఆ పాత్ర చాలా బాగా నచ్చింది. కానీ, ఆ సమయంలో నా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో లియో ఆఫర్ ను వదిలేశాను.. కానీ, విజయ్ తో ముందు ముందు ఎలాంటి పాత్ర వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ” అని చెప్పుకొచ్చాడు. ఇక విశాల్ నో అనడంతో అర్జున్ సర్జా ను తీసుకున్నాడట లోకేష్. ప్రస్తుతం ఈ విశాల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.