Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండగా.. దీపికా పదుకొనే క్యామియోలో కనిపించనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై హైప్ ను తీసుకొచ్చాయి. ఇక రేపు ఈ సినిమా రిలీజ్ కానుంది. ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గరనుంచి ఈ చిత్రంలో ఒక స్టార్ హీరో క్యామియో చేస్తున్నాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. కొందరు విజయ్ అని.. మరికొందరు అల్లు అర్జున్ అని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అట్లీకి విజయ్ కు మధ్య మంచి బాండింగ్ ఉండడంతో.. అతనే నటిస్తున్నాడని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో అట్లీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించిన ఆసక్తికరమైన వివరాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరో క్యామియో ఎవరు అన్నదానికి సమాధానం చెప్పుకొచ్చాడు.
Alia Bhatt: అంబానీ కుటుంబంతో కలిసి బిజినెస్ మొదలుపెట్టిన అలియా..
” జవాన్ లో విజయ్ క్యామియో లేదు. ఉంటే.. నేను ఇప్పటికే చెప్పేవాడిని. అయితే ఆ క్యామియోలో నటించింది నేనే.. ఒక సీన్ లో నేను నటించాను” అని చెప్పుకొచ్చాడు. దీంతో జవాన్లలో క్యామియో చేసింది ఎవరో తెలిసిపోయింది. ఇక ఈ సినిమా తరువాత అట్లీ ప్లాన్స్ ఏంటి అని అడుగగా.. తన కొడుకు మీర్ తో కలిసి టైమ్ స్పెండ్ చేస్తానని, నాలుగు నెలల వరకు ఎక్కడా కనిపించను అని చెప్పుకొచ్చాడు. మరి రేపు థియేటర్ లో జవాన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.