Leading News Portal in Telugu

Sreeleela: క్రేజీ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల అవుట్.. గుంటూరు కారం అయితే కాదుగా.. ?


Sreeleela: టాలీవుడ్ లక్కీయేస్ట్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆమెచేతిలో దాదాపు డజన్ సినిమాల వరకు ఉన్నాయి. టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ అంటే శ్రీలీల పేరే వినిపిస్తుంది. కుర్ర హీరోలు, సీనియర్ హీరోలు మొత్తం ఆమె వెనుక పడేవారే. ఇక ఇవన్నీ పక్కనపెడితే.. ప్రస్తుతం శ్రీలీలకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. అమ్మడు.. ఒక క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని టాక్ నడుస్తోంది. ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటి అనేది తెలియదు. దీంతో శ్రీలీల నటిస్తున్న సినిమాల చిట్టా విప్పుతున్నారు అభిమానులు. కొందరు గుంటూరుకారం అంటుంటే.. ఇంకొందరు నితిన్ సినిమా అంటున్నారు.

Jailer: సోషల్ మీడియాను షేక్ చేసిన కావాలయ్యా వీడియో సాంగ్ వచ్చేసిందోచ్..

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరుకారం. ఈ చిత్రంలో మొదట పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా ఎంపిక కాగా.. కొంత షూట్ అయ్యాక పూజా హెగ్డే సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలిపింది. ఆమె ప్లేస్ లోకి శ్రీలీల మొదటి హీరోయిన్ గా వచ్చింది.. శ్రీలీల ప్లేస్ లోకి మీనాక్షి చౌదరి వచ్చింది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ మీనాక్షినే మొదటి హీరోయిన్ గా పెట్టాలని చూస్తున్నాడని, అందుకే శ్రీలీల తప్పుకుందని అంటున్నారు. ఇది నిజమో కాదో తెలియదు. ఇంకోపక్క నితిన్- వెంకీ కుడుముల చిత్రంలో శ్రీలీలను ఓకే చేసారని టాక్. రష్మిక తప్పుకోవడంతో ఆ ప్లేస్ ఈ భామ రీప్లేస్ చేయడానికి రెడీ గా ఉందని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పటికే నితిన్ తో ఎక్స్టార్డినరీ అనే సినిమాలో నటిస్తోంది.. మళ్లీ రెండో సినిమా ఎందుకు అని వద్దు అన్నదేమో అని ఇంకొందరు అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో తెలియాలంటే.. శ్రీలీల స్పందిస్తే కానీ తెలియదు.