Leading News Portal in Telugu

Jailer: సోషల్ మీడియాను షేక్ చేసిన కావాలయ్యా వీడియో సాంగ్ వచ్చేసిందోచ్..


Jailer:సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. రజినీ స్టైల్ మోహన్ లాల్, శివన్న క్యామియో, తమన్నా అందాలు అన్నింటికీ మించి అనిరుధ్ మ్యూజిక్ వేరే లెవెల్ లో ఉండడంతో సినిమాను ప్రేక్షకులు హిట్ చేసేశారు. దాదాపు రూ.600 కోట్లు కలెక్షన్స్ రాబట్టి రజినీ స్టామినాను మరోసారి రుజువు చేసింది జైలర్. ఇక ఈ చిత్రం నుంచి కావాలయ్యా సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ అయినప్పుడు ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Chitta Teaser: కూతురు కోసం పోరాడే తండ్రిగా సిద్దార్థ్.. అదరగొట్టేశాడు

ఎక్కడ చూసినా అవే స్టెప్స్.. తమన్నా అందాలు మాత్రమే కనిపించేవి. ఈ సాంగ్ తోనే జైలర్ సినిమాపై ఒక హైప్ క్రియేట్ అయింది అంటే అతిశయోక్తి కాదు. థియేటర్లో ఈ సాంగ్ కు అభిమానులు ఎంత రచ్చ చేసారో అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఈ సాంగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. తమన్నా అందాల ఆరబోత, రజిని స్టైల్, సునీల్ కామెడీ అనిరుధ్ మ్యూజిక్ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ అయిన గంటలోనే ఈ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేసింది. వన్ మిలియన్ వ్యూస్ ను సంపాదించి మరో రికార్డును క్రియేట్ చేసింది. మరి ముందు ముందు యూట్యూబ్లో ఈ సాంగ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.