Leading News Portal in Telugu

Ala Ninnu Cheri: అలా నిన్ను చేరి అంటున్న పాయల్


Ala Ninnu Cheri Title Song launched: దినేష్‌ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘అలా నిన్ను చేరి’ సినిమాను నేటితరం నచ్చే, మెచ్చే కంటెంట్ తీసుకొని ఎన్నో జాగ్రత్తలతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ఆడియన్స్ లో ఓ డిఫరెంట్ అనుభూతి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్న మేకర్స్ ఆ దిశగా సినిమాను డిజైన్ చేశారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతుండగా కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాను జనానికి చేరువ చేసే దిశగా ప్రమోషన్స్ చేపడుతున్న దర్శకనిర్మాతలు అలా నిన్ను చేరి టైటిల్ సాంగ్ లాంచ్ చేశారు.

Jawan Preview: మార్కెట్లో మెంటల్ ఎక్కిస్తున్న ‘జవాన్’ ప్రివ్యూ

ఫేమస్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చేతుల మీదుగా ఈ సాంగ్ విడుదల అయింది. ఈ పాటకు ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ రాయగా, సుభాష్‌ ఆనంద్ బాణీలు కట్టారు. ఎంతో ఆహ్లాదకరమైన లొకేషన్స్ లో షూట్ చేసిన ఈ సాంగ్ విజువల్స్ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. దినేష్ తేజ్, పాయల్ రాధాకృష్ణ కెమిస్ట్రీ కూడా ఈ పాటకు మేజర్ అట్రాక్షన్ అయింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పాటలో సుభాష్‌ ఆనంద్ బాణీలు చాలా ప్లెజెంట్ గా అనిపిస్తోంది. ఇక ఈ సినిమాకి సుభాష్‌ ఆనంద్ సంగీతం అందించగా.. ఐ ఆండ్రూ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాలో హీరోహీరోయిన్లతో పాటు శివకుమార్ రామచంద్రవరపు, శత్రు, కల్పలత, ‘రంగస్థలం’ మహేష్, ఝాన్సీ, కేదార్ శంకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.