Leading News Portal in Telugu

Akshay Kumar: గవర్నమెంట్ కన్నా ముందే అక్షయ్ ‘భారత్’గా మార్చేశాడు


ప్రస్తుతం దేశం మొత్తం వినిపిస్తున్న ఒకే ఒక్క టాపిక్ ‘భారత్’. ఇండియా నుంచి భారత్ గా దేశం పేరు మారుస్తున్నారు, సెప్టెంబర్ 18న అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు అనే చర్చ దేశం మొత్తం వినిపిస్తోంది. ఈ పేరు మార్పుకి కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరేమో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు ఏం చేసినా నాకెందుకు… గవర్నమెంట్ కన్నా ముందు నేనే ఫిక్స్ చేస్తా అనుకున్నాడో ఏమో కానీ బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, తన నెక్స్ట్ సినిమాకి భారత్ గా టైటిల్ ఫిక్స్ చేసాడు.

ఖిలాడీ అక్షయ్ కుమార్, డైరెక్టర్ తీను సురేష్ దేశాయ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘మిషన్ రాణిగంజ్’ అనే సినిమా చేస్తున్నాడు. అక్టోబర్ 6న రిలీజ్ కానున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అక్షయ్ కుమార్ సింగ్ లుక్ లో కనిపించాడు. బొగ్గు గనుల నేపధ్యంలో సాగనున్న ఈ సినిమాకి ‘ది గ్రేట్ భారత్ రెస్క్యూ’ అనే క్యాప్షన్ ని ఫిక్స్ చేసారు. నిజానికి ఈ టైటిల్ క్యాప్షన్ లో ఫస్ట్ ఉన్నది… ‘ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ’ అని, దీన్నే భారత్ గా మార్చారు మేకర్స్. భారత్ గా పేరు మారుస్తున్నారు అనే మాట వినిపించడం మొదలైన తర్వాత ఇలా ఒక సినిమా టైటిల్ మార్చడం ఇదే మొదటిసారి. మరి ఇకపై ఇలాంటి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో.