బుల్లితెర యాంకర్ శ్రీముఖి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది.. ఒకవైపు పలు షోలు చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది.. ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ ఫోటోలతో దర్శనం ఇస్తూ వస్తుంది.. తాజాగా కృష్ణాష్టమి సందర్బంగా ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటుంది.. వైట్ డ్రెస్సులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి..
శ్రీముఖి అందానికి సోషల్ మీడియా ఫిదా అయిపోయింది. ట్రెడిషనల్ వేర్లో నిన్ను కొట్టినోళ్లు లేరు. చాలా అందంగా ఉంటావని పలువురు కొనియాడుతున్నారు.. శ్రీముఖి ఫెస్టివ్ లుక్ వైరల్ అవుతుంది. చందమామ అమ్మాయిగా మారితే బహుశా శ్రీముఖిలా ఉంటుందేమో అనేలా ఎంత అందంగా తయారైందో.. యాంకర్ గా ఫాంలో ఉంటుంది..పలు ఛానల్స్ లో భిన్నమైన షోలు శ్రీముఖి చేస్తుంది. షో ఏదైనా శ్రీముఖి తన ఎనర్జీ, గ్లామర్ తో ఆకట్టుకుంది..
మరోవైపు సినిమాల్లో వచ్చిన అవకాశాన్ని వదలకుండా సినిమాలు చేస్తూ వస్తుంది.. ఇటీవల చిరంజీవి భోళాశంకర్ మూవీలో నటించింది.. భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో శ్రీముఖికి ఫేమ్ దక్కకపోగా ఉన్న ఇమేజ్ పోయింది. హీరోయిన్ గా ఎదగాలన్న ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. మొదట్లో శ్రీముఖి హీరోయిన్ గా ప్రయత్నాలు చేశారు. వేచి చూసి విసిగిపోయిన శ్రీముఖి యాంకర్ గా మారారు.. అయినా అమ్మడు తగ్గట్లేదు వరుసగా షోలు చేస్తుంది.. రెండు చేతులా సంపాదిస్తుంది.. హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ నిర్మించుకుంది. ఏడాదికి శ్రీముఖి సంపాదన కోట్లకు చేరింది. తన ఆర్జనతో ఫ్యామిలీని గొప్పగా చూసుకుంటుంది. మొత్తానికి బిందాస్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది..