Leading News Portal in Telugu

Jyotika: ఒక చంద్రముఖి.. ఇంకో చంద్రముఖిని మెచ్చిన వేళ..


Jyotika: టాలీవుడ్ లో చంద్రముఖి గురించి మాట్లాడితే.. వెంటనే జ్యోతిక గుర్తొస్తుంది. ఆ కళ్లు, ఆ డ్యాన్స్, నటన.. అప్పట్లో అభిమానులను తన నటనతోనే భయపెట్టేసింది అంటే అతిశయోక్తి కాదు. జ్యోతికను చూసిన కళ్లతో మిగతావారెవ్వరు మరో హీరోయిన్ ను ఆ క్యారెక్టర్ లో ఉహించుకోలేరు. అలానే నాగవల్లి చిత్రంలో అనుష్క చంద్రముఖిలా కనిపించినా అభిమానులు రిసీవ్ చేసుకోలేకపోయారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. చాలా ఏళ్ళ తరువాత డైరెక్టర్ పి. వాసు చంద్రముఖి సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చంద్రముఖిగా నటిస్తోంది. చంద్రముఖి 2 పేరుతో వస్తున్న ఈ సినిమా వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కంగనాను చంద్రముఖిగా చూసినవారందరు.. జ్యోతికను మరిపిస్తుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే జ్యోతిక.. కంగనాపై ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది.

Jabardasth: లేడీ గెటప్స్.. ఒరిజినల్ ముఖాలను ఎప్పుడైనా చూశారా.. ఇదుగో చూడండి

” మోస్ట్ టాలెంటెడ్ నటీమణుల్లో ఒకరైన కంగనా రనౌత్.. చంద్రముఖి పాత్రను పోషించినందుకు చాలా గర్వపడుతున్నా.. ఆ పాత్రలో ఎంతో అందంగా.. అద్భుతంగా కనిపిస్తున్నారు. మీ నటనకు నేను పెద్ద ఫ్యాన్ ను. ఈ సినిమా కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. మీ కోసమే నేను ఈ సినిమాను చూడాలనుకుంటున్నాను. లారెన్స్, పి వాసుకు మరో హిట్‌ ఖాతాలో పడినట్టే.. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వాలని చిత్రబృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను.. ఆల్ ది బెస్ట్” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఒక చంద్రముఖి.. ఇంకో చంద్రముఖిని మెచ్చిన వేళ.. అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సూపర్ అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో కంగనా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.