Rudramkota to Release on September 22nd: సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహిరిస్తూ ఓ కీలక పాత్రలో నటిస్తున్న `రుద్రంకోట` రిలీజ్ కి రెడీ అయింది. అనిల్, విభీష, రియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఏఆర్ కె విజువల్స్ బ్యానర్ పై రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి నిర్మిస్తున్నారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిసినిమా త్రం సెప్టెంబర్ 22న స్క్రీన్ మాక్స్ పిక్చర్స్ సంస్థ ద్వారా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోన్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా హీరో, నిర్మాత అనిల్ ఆర్క కండవల్లి మాట్లాడుతూ శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యువకుడి లవ్ స్టోరీ అని భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుందని అన్నారు.
Sreeleela: ఇక ప్రతి పండక్కి శ్రీలీల కనపడాల్సిందే.. మామూలు రికార్డు కాదుగా ఇది!
ఇప్పటి వరకు ఎవరూ చూపించని అంశాలను మా సినిమాలో చూపిస్తున్నామని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుంటాయని అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మా సినిమాకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారని, సుభాష్ ఆనంద్ అందించిన రెండు పాటలు ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకున్నాయి. మా సినిమా నచ్చడంతో స్క్రీన్ మాక్స్ పిక్చర్స్ సంస్థ విడుదల చేయడానికి ముందుకొచ్చారని, సెప్టెంబర్ 22న వరల్డ్ వైడ్ గా సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నాం అని అన్నారు. సీనియర్ నటి జయలలిత, ఆలేఖ్య, బాచి, రమ్య తదితరులు నటిస్తోన్న ఈ సినిమాకి ఆదిమల్ల సంజీవ్ డిఓపీగా వ్యవరించారు.