జాతి రత్నాలు సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. అలా అని ఏది పడితే అది.. ఎలా పడితే అలా సినిమాలు చేయలేదు. తనకు సరిపోయే సబ్జెక్ట్‌తో మరో సాలిడ్ కొట్టడానికి రెండేళ్లకు పైగా సమయాన్ని తీసుకున్నాడు. అది కూడా అనుష్క లాంటి సీనియర్ హీరోయిన్‌తో కలిసి ఆడియెన్స్ ముందుకొచ్చాడు. అనుష్క, నవీన్ పోలిశెట్టి కలిసి నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఈ వారమే థియేటర్లోకి వచ్చింది. డే వన్ నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మరో వైపు షారుఖ్ ఖాన్ పాన్ ఇండియా సినిమా జవాన్ థియేటర్లో ఉన్నా కూడా.. పోలిశెట్టి హిట్ టాక్ అందుకున్నాడు. దీంతో మొదటి రోజు మంచి వసూళ్లను రాబట్టింది.
ముఖ్యంగా యూస్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే వసూళ్లను అందుకుంది. 300కే ప్లస్ డాలర్స్ గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ లెక్కన ఓవర్సీస్లో రెండున్నర కోట్లకుపైగా గ్రాస్ వచ్చిందన్న మాట. ఇక ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 4 కోట్ల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక నవీన్ లాగే చాలా గ్యాప్ తర్వాత అనుష్క శెట్టి నటించిన సినిమా ఇదే. దీంతో ఇద్దరు కూడా మంచి హిట్ కొట్టారు. మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉండడంతో శని, ఆదివారాల్లో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. సరోగసీ కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో నవీన్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందంటున్నారు. మహేశ్ బాబు పీ తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించారు.