Leading News Portal in Telugu

Bhagavanth Kesari: భగవంత్ కేసరిలో బాలయ్య ధరించిన డ్రెస్సులు కావాలా? ఇలా చేయండి!


Bhagavanth Kesari official merchandise on Star Zone Live: 2023 సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ఈసారి ‘భగవంత్ కేసరి’గా మన ముందుకు రానున్నాడు. హిట్లే తప్ప ఫ్లాప్ లే లేని డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఈ సినిమా చేస్తున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తుండగా శ్రీలీల కూతురు వరసయ్యే ఒక కీలక పాత్రలో నటిస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీని దసరా బరిలో నిలబెడుతూ మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేశారు. అక్టోబర్ 19న బాలయ్య-అనీల్ రావిపూడిల సినిమా రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని రివీల్ చేస్తూ “భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది” అంటూ మేకర్స్ ఆ మధ్య అనౌన్స్ చేశారు. ఆ తరువాత గణేష్ యాంతం అనే ఒక సాంగ్ ను కూడా రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ అదిరింది.

Chandramukhi 2: బిగ్ బ్రేకింగ్.. చంద్రముఖి 2 వాయిదా..

ఇక వీటిలో బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. కొందరు అభిమానులు బాలయ్య డ్రెస్సులు భలే ఉన్నాయని, తమకు కూడా అలాంటివి కావాలని కామెంట్లు చేసిన క్రమంలో వాటిని కొనుక్కునేలా ఒక అఫీషియల్ మార్చండైజ్ ను సిద్ధం చేశారు మేకర్స్. Starzone.live లో లాగిన్ అయి కావాల్సినవి కొనుక్కోవచ్చని చెబుతున్నారు. ఇక అక్టోబర్ 19న విడుదల చేస్తున్నారు అంటే భగవంత్ కేసరి టీం లాంగ్ వీకెండ్ ని టార్గెట్ చేస్తున్నట్టే కనిపిస్తోది. ఎందుకంటే అక్టోబర్ 24న దసరా పండగ ఉంది, సో భగవంత్ కేసరి సినిమాకి ఆరు రోజుల లాంగ్ గ్యాప్ కలిసొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. బాలయ్య అనగానే సాలిడ్ మ్యూజిక్ ఇస్తున్న తమన్, మరోసారి భగవంత్ కేసరి మ్యూజిక్ తో అదరగొడతాడని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో భగవంత్ కేసరి నందమూరి ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టి పంపడం పక్కా అని అంటున్నారు.