Leading News Portal in Telugu

OG : పవన్ కళ్యాణ్ ఓజి సినిమా పై క్రేజ్ మాములుగా లేదుగా…


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజి. ఈ సినిమా కోసం అభిమానుల తో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తిఅయింది.. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన మొదటి గ్లింప్స్ వీడియో ని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భం గా సెప్టెంబర్ 2 వ తేది న చిత్ర యూనిట్ విడుదల చేసారు.ఈ గ్లింప్స్ వీడియోకి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.పాన్ ఇండియా స్థాయి లో ఈ గ్లింప్స్ వీడియో కి వేల సంఖ్యలో రియాక్షన్ వీడియోస్ వచ్చాయి. యూట్యూబ్ లో ఈ గ్లింప్స్ ఇప్పటి వరకు రెండు కోట్ల 40 లక్షల వ్యూస్ రాబట్టింది.

ఇప్పటికీ టాప్ లో నే ట్రేండింగ్ అవుతూ ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రొఫైల్ ని ‘బుక్ మై షో” ఆన్లైన్ టికెట్ సేల్స్ యాప్ లో యాడ్ చేసారు. యాడ్ చేసిన వెంటనే ఈ ప్రొఫైల్ తెలుగు రాష్ట్రాల లోని అన్నీ ప్రాంతాలలో నెంబర్ 1 స్థానం లో ట్రెండింగ్ అవుతుంది.రీసెంట్ గా విడుదలైన కొత్త సినెమాలు ‘జవాన్’మరియు ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ వంటి వాటిని కూడా డామినేట్ చేస్తూ నెంబర్ 1 స్థానం లో వుండి రికార్డు క్రియేట్ చేసింది.ఇప్పటి వరకు ఈ చిత్రానికి ‘బుక్ మై షో’ యాప్ లో 14 వేల కు పైగా ఇంట్రెస్ట్ లైక్స్ వచ్చాయి. చిత్ర ప్రొఫైల్ ని యాడ్ చేసి కనీసం రెండు రోజులు కూడా కాలేదు.అప్పుడే టాప్ లో ట్రెండింగ్ అవుతుంది అంటే ఈ చిత్రం క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు