Adurs Re Release: యంగ్ టైగర్ ఎన్టీఆర్, నయనతార జంటగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అదుర్స్. వల్లభనేని వంశీ నిర్మించిన ఈ సినిమా 2010 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ డబుల్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో షీలా మరో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఇప్పటికీ ఒక మాస్టర్ పీస్. ముఖ్యంగా సోషల్ మీడియాలో మీమ్స్ చివరికి ఈ సినిమా ఒక బుక్. ఇందులో కామెడీ, సాంగ్స్, యాక్షన్.. ఓ రేంజ్ లో ఉంటాయి. ముఖ్యంగా చారి, బట్టు కామెడీ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య జరిగే సీన్స్.. డైలాగ్ టూ డైలాగ్ చెప్పే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక ఇప్పుడు ఈ సినిమా మరోసారి రిలీజ్ కు సిద్దమవుతుంది.
Rithu Chowdary: విప్పి చూపించడమే పనిగా పెట్టుకున్నావా.. మరీ ఇంతగానా.. ?
ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే స్టార్ హీరోల హిట్ సినిమాలు. కల్ట్ క్లాసిక్ లు రీ రిలీజ్ చేసి మేకర్స్.. అభిమానులను సంతోషపెడుతున్నారు. ఇక తాజాగా అదుర్స్ ను కూడా రీ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 4k వర్క్ నడుస్తుందంట.. ఈ ఏడాదిలో ఈ సినిమా రీ రిలీజ్ కానుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు అదుర్స్ ఫ్యాన్స్ కూడా ఎగిరి గంతేస్తున్నారు. అదుర్స్ లోని డైలాగ్స్ గుర్తుచేసుకుంటూ.. ఇదేం ఫీలింగ్ రా చారి.. గుండె ఆనందంతో పొంగిపోతుంది.. చంద్రకళతో భట్టు మరోసారి వస్తున్నాడట అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాకు థియేటర్ లో ఎలాంటి రచ్చ ఉండబోతుందో చూడాలి.