Ravindar Chandrasekaran arrested in Chennai: ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అక్కడ టాప్ నిర్మాతగా కొనసాగుతున్నారు. లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన పలు సినిమాలు నిర్మించగా అందులో చాలా సినిమాలు మంచి విజయాలు కూడా అందుకున్నాయి. గత ఏడాది టీవీ నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని అయన వార్తల్లో నిలిచారు. ఎందుకంటే తనకంటే వయసులో 20 ఏళ్లు తక్కువ వయసు ఉన్న అమ్మాయి కావడం చంద్రశేఖరన్ చాలా లావుగా ఉండటం, ఆమె హైట్ -వైట్ లో చాలా చిన్నఅమ్మాయి కావడంతో నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. ఇటీవల తన భార్య మహాలక్ష్మితో కలిసి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సిరీని జరుపుకున్న ఆయనను ఇప్పుడు చెన్నైలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) అరెస్ట్ చేశారు. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను మోసం చేసినందుకు గాను ఆయనను పోలీసులు అరెస్ట్ చేరినట్టు తెలుస్తోంది.
Allari Naresh: ఆ హీరో కోసం రేటు తగ్గించి మరీ ఓకే చెప్పిన అల్లరోడు..?
అసలు విషయం ఏమిటంటే ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఓ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చని చెన్నైకి చెందిన బాలాజీ అనే ఒక వ్యాపారవేత్తను నమ్మించిన రవీందర్ చంద్రశేఖరన్ నకిలీ పత్రాలను కూడా సిద్ధం చేయించాడని అంటున్నారు. అందుకు బాలాజీ నుండి రూ. 15.83 కోట్లు తీసుకున్నాడని, ఈ క్రమంలో ప్రాజెక్టు గురించి ఈ ఇద్దరి మధ్య సెప్టెంబర్ 17, 2020న ఒప్పందం కూడా జరిగింది. అయితే అది మోసపూరితమైన ప్రాజెక్టు అని తెలియడంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని బాలాజీ కోరడంతో రవీందర్ నుంచి సరైన సమాధానం రాలేదు. ఈ కూర్మంలో రవీందర్ చంద్రశేఖరన్ పై చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి రవీందర్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.