Madras High Court has banned the release of Mark Antony: తెలుగు వాడైనా తమిళంలో స్టార్ హోదా అనుభవిస్తున్న హీరో విశాల్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం మార్క్ ఆంటోనీ. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ మూవీలో తమిళ దర్శకులు ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్ తెలుగు నటుడు సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 15న విడుదలఅయ్యేందుకు సిద్దమైన మార్క్ ఆంటోనీకి షాక్ తగిలింది. ఎందుకంటే ఈ సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టు నిషేధం జారీ చేసింది. లైకా ప్రొడక్షన్స్‌కు చెల్లించాల్సిన రూ.21.29 కోట్లలో రూ.15 కోట్లు చెల్లించడంలో నటుడు విశాల్ విఫలమైన నేపథ్యంలో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేశాయి.
Vijay Leo: అదిదా… విజయ్ మెంటల్ మాస్
సినిమాకి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులు మేకర్స్‌కి పెద్ద షాక్ గామారాయి. ఈ ‘మార్క్ ఆంటోని’ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌గా ప్లాన్ చేసి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ అలాగే హిందీ మొత్తం ఐదు భాషలలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 15న రిలీజ్ కావాల్సిన స్కంద, చంద్రముఖి 2 సెప్టెంబర్ 28కి వాయిదా పడ్డాయి. ఇప్పుడు మార్క్ ఆంటోనీ కూడా విడుదల చేయకపోతే, వినాయక చవితి సెలవుల సీజన్‌లో బాక్స్ ఆఫీస్ కి ఎదురుదెబ్బ గానే భావించాల్సి ఉంటుంది. జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని యూనిట్ భావిస్తోంది.