Vijay LEO Creates New Records in UK with massive advance bookings: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న లియో సినిమా మీద భారీ అంచనాలున్నాయి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఆయన చివరి సినిమా విక్రమ్ అప్పటివరకు ఉన్న తమిళ సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఒక కారణం అయితే విజయ్ కాంబినేషన్ మరో కారణం. ఇక ఈ మూవీ టికెట్ బుకింగ్స్‌ను నెల రోజుల ముందుగానే సెప్టెంబర్ 7 నుంచి ఓపెన్ చేశారు మేకర్స్. అక్టోబర్ 19న విడుదల కానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ సెప్టెంబర్ 7న యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతానికి, ఈ సినిమా 175 షోల కోసం 92 ప్రాంతాల్లో ప్రారంభించబడగా ప్రారంభించిన 24 గంటల్లో 120000 పౌండ్లకు ($152000) చేరుకుంది.
Dil Raju: స్కందకి చంద్రముఖి 2 షాక్.. దిల్ రాజు ఇప్పుడు ఏం చేస్తాడు?
ఒక్క మాటలో చెప్పాలంటే ఇది తమిళ సినిమాల్లోనే రికార్డు అని తెలుస్తోంది. లియో సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ జోనర్‌లో వస్తోన్న ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ ఈ మూవీకి డైలాగ్స్ అందిస్తున్నారు. మాస్టర్ తర్వాత విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో లియో పై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.