తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం చాలా బిజీ గా వున్నారు. ఆయన ప్రస్తుతం కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2’, రామ్‌చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.ఇవి రెండు కూడా సోషల్ మెసేజెస్ అందించే సినిమాలే. వీటిని కూడా హై రేంజ్ విజువల్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు శంకర్. ఈ రెండు చిత్రాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.అయితే గేమ్ చేంజర్ సినిమా కోసం మెగా అభిమానులు అప్డేట్స్ ఇవ్వండి అంటూ చిత్ర యూనిట్ పై ఒత్తిడి తెస్తున్నారు.అయితే ‘గేమ్ ఛేంజర్’పై సినిమా రిలీజ్ డేట్‌పై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. ఎన్నో సార్లు వాయిదా పడుతూ వస్తోంది.
ఆ మధ్య లో వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది వస్తుందని వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. కానీ శంకర్ భారతీయుడు 2 సినిమాను కూడా పూర్తి చేస్తుండడంతో అదే ముందు వస్తుందని ఫిక్సై పోయారు. అయితే శంకర్ ఈ రెండు చిత్రాల రిలీజ్ డేట్ లను సరికొత్త గా ప్లాన్ చేసినట్లు సమాచారం.భారతీయడు 2 చిత్రాన్ని 2024 ఇండిపెండెన్స్ డే కానుక గా విడుదల చేస్తున్నట్లు సమాచారం.ఆ కథకు ఆ డేట్ అయితేనే ఫెరఫెక్ట్ అని అందరూ భావిస్తున్నారట.దీనితో ‘గేమ్ ఛేంజర్’ సినిమా ను వేసవికి రిలీజ్ చేసేలా షూటింగ్ షెడ్యూల్స్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల తేదీ పై దాదాపు గా ఓ క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. ఆల్మోస్ట్ దీన్నే కన్ఫామ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. గేమ్ చేంజర్ సినిమా ను మార్చి మూడు లేదా నాలుగో వారం లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారని సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.. నాలగైదు నెలల గ్యాప్ లో శంకర్ తన రెండు భారీ చిత్రాలను విడుదల చేసేందుకు పక్కా ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది