Leading News Portal in Telugu

Meera Chopra : అందుకే పవన్ కల్యాణ్ రియల్ హీరో అయ్యారు..


మీరా చోప్రా.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఈ భామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన బంగారం సినిమాలో నటించి మెప్పించింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో తెలుగు లో అంతగా అవకాశాలు రాలేదు. అయితే రీసెంట్ గా హీరోయిన్ మీరా చోప్రా వరుసగా ఉదయనిధి స్టాలిన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు పెడుతోంది.ప్రముఖ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పై చేసిన కామెంట్స్ పై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు మండి పడుతున్నాయి.ఉదయనిధి కామెంట్స్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ ఎంతో బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు అంటూ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఉదయనిధి స్టాలిన్ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది.

తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయనిధి స్టాలిన్.. డెంగ్యూ, మలేరియా ఎలాగో.. సనాతన ధర్మం కూడా అంతే. మనం కేవలం దానిని వ్యతిరేకించి ఊరుకోకూడదు. నిర్మూలించాలి అంటూ ఘాటైన కామెంట్స్ చేశారు.ఈ కామెంట్స్ పై హిందూ సంఘాలు రగిలిపోతున్నాయి. . ఈ క్రమంలో మీరా చోప్రా పవన్ కల్యాణ్ సనాతన ధర్మం పై గతంలో చేసిన వ్యాఖ్యలని మీరా చోప్రా పోస్ట్ చేసింది.గతంలో సనాతన ధర్మం పై పవన్ వ్యాఖ్యలకు ఇంప్రెస్ అయిన మీరా చోప్రా.. పవన్ కల్యాణ్ రియల్ హీరో అయ్యాడంటే అందుకు కారణం ఇదే అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో గతంలో పవన్ చేసిన సనాతన ధర్మానికి సంబంధించిన ప్రసంగం ఉంది. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘నా సనాతన ధర్మాన్ని నేను పాటిస్తున్నప్పుడు విమర్శించే హక్కు ఎవరికీ కూడా లేదు. ఒక వేళ అలా విమర్శిస్తున్నారు అంటే మీ సిద్ధాంతాలు, అజెండాలు వేరే ఉన్నాయి అని అర్థం.సెక్యులరిజం పేరుతో సనాతన ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవతలపై దూషణలకు దిగడం మంచిది కాదు అని పవన్ హెచ్చరించిన ఆ వీడియోపై మీరా చోప్రా ప్రశంసలు కురిపించింది.ఉదయనిధి స్టాలిన్ కి కౌంటర్ గానే మీరా చోప్రా ఈ పోస్ట్ చేసిందని తెలుస్తుంది..

https://twitter.com/MeerraChopra/status/1700112466779472234?s=20