Leading News Portal in Telugu

Deepthi Sunaina: ”దీప్తి సునయనకి రోడ్డు ప్రమాదం” ప్రచారం.. అసలు ఏం జరిగిందంటే?


Deepthi Sunaina Rubbishes her Road Accident News in Instagram: టిక్‌టాక్‌, డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న దీప్తి సునైనా ఆ తరువాత యూట్యూబ్ లో కూడా హల్చల్ చేసింది. షార్ట్ ఫిలిమ్స్. రీల్స్, టిక్ టాక్ అని దేన్నీ వదలకుండా ఆమె అందివచ్చిన అన్ని అవకాశాలను వాడుకుంటూ పోయింది. ఈ క్రమంలో ఏకంగా నాగార్జున హూస్ట్‌గా నిర్వహించే బిగ్‌బాస్‌లో కూడా అవకాశం రావడంతో దశ తిరిగింది. అయితే ఆ హౌస్ నుంచి బయటకు వచ్చాక షణ్ముఖ్ జశ్వంత్‌తో ఉన్న ప్రేమ బయట పడడం మనోడు బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఆ బంధానికి బీటలు వారడం అనే విషయాలు అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం యూట్యూబ్‌లలో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ కొంత డబ్బు సంపాదించుకునే పనిలో పడ్డ ఆమెకు యాక్సిడెంట్ అయింది అంటూ యూట్యూబ్ లో వార్తలు రావడం మొదలయ్యాయి.

Jithender Reddy: అసలు ఎవరీ జితేందర్ రెడ్డి?

అయితే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో ఆ వార్తలు నిజం కాదని తేలింది. అయితే ఈరోజు ఒక ఫాలోవర్ ఆమె దృష్టికి ఈ విషయం తీసుకు వెళ్లడంతో ఆమె ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చింది. నిజానికి ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని, ఆమె చెప్పుకొచ్చింది. ఇలా వార్తలు రావాడనికి ముఖ్య కారణం ఒక వీడియో అని, అందులో తనకు యాక్సిడెంట్ అవుతున్నట్టు ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే అది నిజమైన యాక్సిడెంట్ కాదని పేర్కొన్న ఆమె సుమారు ఏడెనిమిదేళ్ల క్రితం అలియా ఖాన్ అనే షార్ట్ ఫిలిం చేశానని, అందులోని క్లిప్ ను ఇలా తనకు యాక్సిడెంట్ అయిందని వార్తలు సృష్టించేందుకు వాడుతున్నరని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు తనకు ఏమీ కాలేదని ప్రస్తతానికి తాను చాలా బాగున్నానని కూడా ఆమె అన్నారు. సో ఆమెకు యాక్సిడెంట్ అయిందంటూ వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవమే అన్నమాట.