Leading News Portal in Telugu

Anand Deverakonda: “గం..గం..గణేశా” అంటున్న బేబీ హీరో.. ఈసారి గన్నులు పట్టి దిగాడు!


Anand Deverakonda’s Next Gam Gam Ganesha first look poster released: “బేబీ” సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా” అనే కొత్త సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటిదాకా లవ్ మూవీస్ చేస్తూ వచ్చిన ఆనంద్ మొట్టమొదటిసారిగా యాక్షన్ జానర్ లో ఈ సినిమా చేస్తున్నారు. “గం..గం..గణేశా” సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తుండగా ఉదయ్ శెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న”గం..గం..గణేశా” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా ఆనంద్ దేవరకొండ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేశారు. పోస్టర్ లో రెండు రైఫిల్స్ పట్టుకున్న ఆనంద్ దేవరకొండ సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచేస్తున్నారు.

Deepthi Sunaina: ”దీప్తి సునయనకి రోడ్డు ప్రమాదం” ప్రచారం.. అసలు ఏం జరిగిందంటే?

ఇక పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో గన్స్ పట్టుకున్న గ్యాంగ్స్, బాంబ్ బ్లాస్టింగ్ సీన్స్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే రాజావారి పల్లి అనే బోర్డు మీద రన్ – ఫన్ – గన్ అనే క్యాప్షన్ కూడా రాసి ఉంది. మొత్తంగా ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోందని చెప్పక తప్పదు. “గం..గం..గణేశా” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేస్తూ ఇది యాక్షన్ మూవీనా ?, కామెడీ మూవీనా ? ..త్వరలో మనం తెలుసుకుందాం అని మరిన్ని డీటెయిల్స్, ఎగ్జైటింగ్ అప్ డేట్స్ రాబోతున్నాయి అని క్యాప్షన్ రాసుకొచ్చాడు ఆనంద్. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.