Leading News Portal in Telugu

Trisha : త్రిషకు ముద్దు పెట్టడానికి నిరాకరించిన ఆ స్టార్ హీరో..


స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒకప్పుడు టాలీవుడ్‌లో  స్టార్‌ హీరోల అందరితో కలిసి నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో ఈ భామ నటించింది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్‌లో సినిమాలు చేయడం తగ్గించింది.ఇటీవల `పొన్నియిన్‌ సెల్వన్‌`తో మరోసారి బిజీ గా మారింది.వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ మళ్లీ బిజీ అవుతుందీ ఈ బ్యూటీ.ఇదిలా ఉంటే త్రిష కెరీర్ ఆరంభం నుంచి ముద్దు సీన్లు వంటి వాటికి దూరంగా ఉండేది. కొన్ని సినిమాలలో రొమాన్స్ పండించిన అవి కూడా చాలా తక్కువ.కానీ ఆమె నటించిన రొమాంటిక్ లవ్‌ స్టోరీ `96` చిత్రంలో మాత్రం ముద్దు సీన్ కు ఓకే చెప్పింది. ఆ సినిమాలో హీరోగా విజయ్‌ సేతుపతి నటించిన సంగతి తెలిసిందే.

తమిళంలో పెద్ద హిట్‌ అయిన ఈ మూవీలో లిప్‌ లాక్‌ సీన్‌ ఒకటి ఉంటుందట.. క్లైమాక్స్ లో హీరోహీరోయిన్లు విడిపోయే సమయంలో లిప్‌ లాక్‌ పెట్టుకోవాల్సి వస్తుంది.. ముందుగా దర్శకుడు స్క్రిప్ట్ లో అలానే రాసుకున్నాడట. దానికి త్రిష కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. క్లైమాక్స్ లో ఎయిర్‌పోర్ట్ వద్ద త్రిష, విజయ్‌ సేతుపతి ఒకరినొకరు విడిపోవాల్సి రావడం జరుగుతుంది.. దీంతో ఆ ఫీలింగ్‌ని భరించ లేక త్రిష విజయ్‌సేతుపతి వద్దకి వచ్చి హగ్‌ చేసుకుంటుంది. కానీ ముద్దు పెట్టుకోదు. కేవలం హీరో తలని మాత్రమే పట్టుకుంటుంది. హీరో కూడా ఆమెని పట్టుకుని ఫీల్ అవుతుంటాడు.. అయితే ఆ సమయంలో త్రిషకి లిప్‌ లాక్‌ ఇచ్చేందుకు విజయ్‌ సేతుపతి నిరాకరించాడట.ఆయన ముద్దు సీన్లకి దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆ సీన్‌ చేయాల్సి వున్నా ఆయన చేయలేకపోయారట.చివరి నిమిషంలో విజయ్‌ సేతుపతి అంతటి సాహసం చేయలేకపోవడంతో ఆ సీన్‌ లేకుండానే సినిమాను ముగించారు. అయితే  ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని అంతకంటే బలమైన ఫీల్‌ని కలిగించేలా యాక్ట్ చేయడం సినిమాకు హైలైట్ గా నిలిచింది.వారిద్దరి కెరీర్‌లోనే మైల్ స్టోన్ మూవీ గా `96` మిగిలిపోతుంది