Leading News Portal in Telugu

Jithender Reddy: అసలు ఎవరీ జితేందర్ రెడ్డి?


Director Virinchi Verma’s next movie “Jithender Reddy ” Title Poster unveiled: ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విరించి వర్మ ఆ తరువాతి సినిమా చేసేందుకు చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్ తర్వాత ఆయన ఒక ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న జితేందర్ రెడ్డి సినిమాకు ఇప్పుడు విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. జితేందర్ రెడ్డి సినిమా టైటిల్ పోస్టర్ ను తాజాగా దర్శకుడు దేవకట్టా విడుదల చేశారు.

Samantha: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కి సమంత రివ్యూ.. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా లేదంటూ!

1980 లో జరిగే ఒక పిరియడిక్ కథగా రూపొందుతున్న ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకుని నడిచే సీరియస్ యాక్షన్ డ్రామా కథగా ఉండబోతుందని అంటున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి.ఎస్.జ్ఞానశేఖర్ ఈ సినిమాకు కెమెరామెన్ గా వర్క్ చేస్తుండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. నాగేంద్ర కుమార్ ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నట్టు వెల్లించాడు. నిజానికి డైరెక్టర్ విరించి వర్మ తన గత రెండు చిత్రాలతో లవ్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాతో ఈ కొత్త సినిమా చేశారు. ఇక ఈ సినిమా హీరో ఎవరనేది త్వరలో ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికీ హీరో పేరు సహా ఎవరి పేర్లు రివీల్ చేయక పోగా ఈ మూవీకి సంబంధించిన ఆర్టిస్టుల వివరాలు, ఫస్ట్ లుక్ త్వరలోనే మీడియాకు తెలియజేయనున్నట్టు వెల్లడించారు.