Leading News Portal in Telugu

Changure Bangaru Raja: సందు చూసి పండక్కి సినిమా దింపుతున్న రవితేజ


Ravi Teja’s RT Teamworks – Satish Varma’s Changure Bangaru Raja Releasing: మాములుగా సినిమాలకి పండగలు బాగా వర్కౌట్ అవుతాయి. శుక్రవారానికి ఒకట్రెండు రోజులు అటూ ఇటుగా ఏదైనా పండుగ వస్తుంది అంటే ఆ పండుగ రోజున సినిమా రిలీజ్ చేసి సెలవులు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక రాబోతున్న వినాయక చవితి విషయంలో కూడా అదే జరిగింది. ఈ వినాయక చవితికి ముందుగా స్కంద, టిల్లు స్క్వేర్ అనే రెండు సినిమాలను సెప్టెంబర్ 15న రిలీజ్ చేయాలని నిర్మాణ సంస్థలు ఎప్పుడో కర్చీఫ్ వేసుకున్నాయి. ఇక అదే టైముకు మార్క్ ఆంటోనీ, చంద్రముఖి 2 అనే రెండు తమిళ సినిమాలను కూడా తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని అనుకున్నారు.

Samantha: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కి సమంత రివ్యూ.. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా లేదంటూ!

అలాగే రామన్న యూత్ అనే ఒక చిన్న తెలుగు సినిమా కూడా డేట్ సెట్ చేసుకుంది. అయితే చంద్రముఖి 2, స్కంద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి చంద్రముఖి 2ని ఆపలేక స్కందను వెనక్కి పంపి 28న రిలీజ్ డేట్ అనౌన్స్ చేయించారు. ఇక ఇప్పుడు చంద్రముఖి 2 రిలీజ్ డేట్ అనుకోని కారణాలతో 28కి వాయిదా పడింది. మార్క్ ఆంటోనీకి కోర్టు బ్రేక్ వేసింది, రిలీజ్ చేయగలరో లేదో చూడాలి. అయితే ముందే టిల్లు స్క్వేర్ వాయిదా వేయడంతో ఇప్పుడు కేవలం రామన్న యూత్ అనే చిన్న సినిమా మాత్రమే బరిలో ఉన్నట్టు అయింది, ఈ క్రమంలో హీరో రవితేజ ఒక ఇంట్రెస్టింగ్ నిర్ణయం తీసుకున్నాడు. మాస్ మహారాజా రవితేజ ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్‌వర్క్స్ నుంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ రాబోతోంది.

సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ‘ఛాంగురే బంగారురాజా’ ప్రేక్షకుల ముందుకు రానుందని ఈసినిమా యూనిట్ ప్రకటించింది. ‘C/o కంచరపాలెం’, ‘నారప్ప’ ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా, గోల్డీ నిస్సీ హీరోయిన్ గా నటించింది. రవిబాబు, సత్య ఈ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా టీజర్‌ను గతంలోనే విడుదల చేసారు. ఈ సినిమాకి కృష్ణ సౌరభ్ సంగీతం సమకూరుస్తుండగా, సుందర్ ఎన్‌సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక రిలీజ్ కి వారం కూడా లేకపోవడంతో త్వరలో ‘ఛాంగురే బంగారురాజా’ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.