Genelia: బొమ్మరిల్లు చిత్రంలో హా.. హా.. హాసినిగా తెలుగు ప్రేక్షకుల మదిలో చేరువైపోయింది జెనీలియా డిసౌజా. ఇక ఈ సినిమా తరువాత స్టార్ హీరోలతో నటించి మంచి హిట్స్ ను అందుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే .. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహమాడి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక పెళ్లి, పిల్లలు, బాధ్యతలు తీసుకొని గృహిణిగా సెటిల్ అయ్యింది. జెనీలియాకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక వారు ప్రస్తుతం స్కూల్ కు వెళ్తున్నారు. దీంతో కొంత గ్యాప్ తరువాత ఈ చిన్నది రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన మజిలీ సినిమాను వేద్ అనే పేరుతో జెనీలియా, రితేష్ రేంక్ చేసి హిట్ అందుకున్నారు. ఆ సినిమాకు వీరే నిర్మాతలు కావడం విశేషం. ఇక ఈ సినిమా తరువాత జెనీలియాకు మంచి మంచి అవకాశాలే వస్తున్నాయి.
Maharaja: ఒంటినిండా గాయాలతో విజయ్ సేతుపతి..
ఇక ఈ తరుణంలోనే ఈ చిన్నది మరోసారి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం.. జెనీలియా బేబీ బంప్ తో బయటకు రావడమే. గతరాత్రి ముంబైలో జెనీలియా, రితేష్ ఒక ప్రైవేట్ ఈవెంట్ లో సందడి చేశారు. ఇక ఈ ఈవెంట్ కు జెనీలియా.. వైలెట్ కలర్ మినీ ఫ్రాక్ లో వచ్చింది. ఇక ఈ గౌన్ లో ఆమె బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో ఆమెను చూసిన అభిమానులు జెనీలియా ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంతో నిజం అనేది జెనీలియానే చెప్పాల్సి ఉంది.